‘బాహుబలి‘తో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్.. ఆ తర్వాత ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్’ చిత్రాలతో ఆశించిన విజయాలను అందుకోలేదు. ‘సాహో’ ఫర్వాలేదనిపించినా.. ‘రాధేశ్యామ్, ఆదిపురుష్’ అయితే ఘోరంగా విఫలమయ్యాయి. ఒక స్టేజ్ లో ప్రభాస్ పనైపోయిందన్న వాళ్లు ఉన్నారు. అప్పుడే వచ్చింది ‘సలార్’. రెబెల్ స్టార్ లోని రెబలిజమ్ ను మరోసారి ప్రేక్షకులకు చేరువ చేసింది.
ఇప్పుడు ఇండియాలో ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్నాడు ప్రభాస్. ‘కల్కి, రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2’, హను రాఘవపూడి ఇలా బ్యాక్ టు బ్యాక్ అరడజను సినిమాలను తన కిట్టీలో వేసుకున్నాడు. అందుకే.. ఎక్స్ (ట్విట్టర్)లో ప్రతి రోజూ ఏదో ఒక సినిమాతో ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉన్నాడు. రెబెల్ స్టార్ సాధిస్తున్న సరికొత్త ఘనతలు, రేర్ కాంబినేషన్స్, రికార్డు స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్.. ఇలా ఏ అంశంలో చూసినా రేసులో ప్రభాస్ మిగతా స్టార్స్ అందుకోలేనంత ఎత్తులో దూసుకెళ్తున్నాడు.
ఈ క్రేజ్ తాజాగా ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులోనూ కనిపించింది. ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులో ఏకైక హీరోగా నిలిచాడు. ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్ లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. ట్విట్టర్ ఇండియా ఈ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇది ప్రభాస్ స్టార్ డమ్ కు సోషల్ మీడియాలో కనిపించిన రిఫ్లెక్షన్ అనుకోవచ్చు. ప్రభాస్ సాధించిన ఈ క్రెడిట్ తో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు.