బ్యాంకాక్ లో ‘కుబేర’.. సెట్స్ లో నాగార్జున సందడి

క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి విభిన్నమైన ప్రయోగం చేస్తున్నాడు. నాగార్జున, ధనుష్ కాంబోలో ‘కుబేర’ పేరుతో రేర్ మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టాడు. బికారి తరహా లుక్ లో ‘కుబేర’లో కనిపించబోతున్నాడు ధనుష్. ఇటీవల ‘కుబేర’ నుంచి వచ్చిన ధనుష్ ఫస్ట్ లుక్ కి మంచి అప్లాజ్ లభించింది. ఇక.. లేటెస్ట్ గా ఈ మూవీ షెడ్యూల్ బ్యాంకాక్ కి షిప్టయ్యింది.

బ్యాంకాక్ షెడ్యూల్ లో నాగార్జున పాల్గొంటున్నాడు. సెట్స్ లో నుంచి రిలీజైన వర్కింగ్ స్టిల్స్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏదో చెబుతుండగా.. అందుకు నాగార్జున ప్రతిస్పందిస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ స్టిల్ లో టక్ వేసుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు కింగ్. అయితే.. నాగార్జున ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు.

తన రెగ్యులర్ జానర్స్ నుంచి కాస్త పక్కకు జరిగి.. ఈసారి ఓ సరికొత్త జానర్ ను ట్రై చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఈ మల్టీస్టారర్ లో రష్మిక కథానాయికగా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహనరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Posts