పృథ్విరాజ్ డైరెక్షన్ లో ప్రభాస్..

ఇండియాస్ టాప్ స్టార్.. బాక్సాఫీస్ బుల్డోజర్ ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు మామూలు విషయం కాదు. అది గ్లోబల్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే సత్తా ఉన్న కంటెంట్ అయి ఉండాలి. లేదంటే ఆయన వరకూ కథే వెళ్లదు. ప్రస్తుతం చాలా వేగంగా సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్.

ఆల్రెడీ పూర్తయిన సలార్ సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. సంక్రాంతికి లేదా 2024 సమ్మర్ కి ప్రాజెక్ట్ కే వస్తుంది. అటుపై మారుతి డైరెక్ట్ చేస్తోన్న రాజా డీలక్స్ ఉంది. వీటితో పాటు సలార్ 2 కూడా సమ్మర్ లో వచ్చే అవకాశం ఉంది. వీటిలో సలార్ షూటింగ్ అయిపోయింది. కల్కి, రాజా డీలక్స్ మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. కల్కి కూడా మాగ్జిమం ప్రభాస్ పోర్షన్ పూర్తయింది. ఉంటే సెకండ్ పార్ట్ కోసం మిగిలి ఉంటుందని టాక్. దీంట్లోనే కమల్ హాసన్ తో కలిసి ఉండే సీన్స్ ఉంటాయి. ఇక రాజా డీలక్స్ 70శాతం ఒకే సెట్ లో జరిగే షూటింగ్. ఇదీ సగం వరకూ పూర్తయిందని టాక్. అయితే లేటెస్ట్ గా మరో హాట్ న్యూస్ వినిపిస్తోంది.


మళయాల సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ .. ప్రభాస్ కు ఓ కథ చెప్పాడట. ఇతను సలార్ లో విలన్ గానూ నటించాడు. ఆ సాన్నిహిత్యంతో ఓ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ స్టోరీని ప్రభాస్ కు వినిపించాడట. కానీ ఆల్రెడీ చేస్తున్న సలార్ లోనూ అతను గ్యాంగ్ స్టర్ గానే కనిపించబోతున్నాడు. పైగా ఇది రెండు భాగాలుగా వస్తుంది. అంటే అప్పటికే గ్యాంగ్ స్టర్ అనే పాత్ర రొటీన్ అవుతుంది. మళ్లీ మరో సినిమాలో అంటే ఆడియన్స్ చూస్తారా అనే కంటే ముందు అతను చేస్తున్నప్పుడు ఎగ్జైట్ కావాలి కదా.. అందకే కథ నచ్చినా ఏ డెసిషన్ చెప్పలేదు అంటున్నారు.

నిజానికి ఇప్పుడున్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత ప్రభాస్.. స్పిరట్ సినిమా చేయాలి.అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసే సినిమా ఇది. ఈ మూవీ 2024 ఫస్ట్ హాఫ్ లో స్టార్ట్ అవుతుందంటున్నారు. సో.. పృథ్వీరాజ్ స్టార్ హీరో అయినా ఇప్పటి వరకూ రెండు సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఒకటి లూసీఫర్. మళయాలంలో బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రాన్నే చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశాడు. మరోటి బ్రో డాడీ. ఇదీ బ్లాక్ బస్టర్. సో మరి ప్రభాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Related Posts