‘బ్రో’కు పోటీయే లేదు..

పవన్ కళ్యాణ్‌ సినిమా విడుదలవుతుందంటే ఎంత హంగామా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ టైమ్ అలాంటిదేం లేకుండా నార్మల్ గా విడుదలవుతున్న సినిమా బ్రో. సాయితేజ్ మర హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ అందించాడు.

ట్రైలర్ తో ఇంప్రెస్ చేసి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కాస్త హైప్ తెచ్చుకున్న ఈ మూవీ ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. మామూలుగా ఫ్రైడే అంటే పెద్ద సినిమాలు ఉన్నా.. చిన్నవాళ్లూ పోటీలో ఉంటారు. పోటీ ఇస్తారు అని చెప్పలేం కానీ తాము కూడా బరిలోకి దిగుతుంటారు. ఇప్పుడు బ్రో కు కూడా అలాంటి సిట్యుయేషన్ ఉంది. కానీ వీళ్లెవరూ పోటీ ఇవ్వడం కాదు కదా కనీసం తమ ఉనికిని తామైనా చాటుకునే పరిస్థితిలో లేరు.


బ్రో 28న విడుదలవుతుంది. ఈ చిత్రానికి ఎక్స్ ట్రా షోస్ కానీ, ప్రీమియర్స్ కానీ, టికెట్ రేట్లు పెంచడం వంటివేం లేవు. సాధారణంగానే వస్తోంది. అయితే ఆ తర్వాతి రోజు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు, ప్రణవి జంటగా నటించిన స్లమ్ డాగ్ హజ్బెండ్ అనే సినిమా వస్తోంది.

ఈ సినిమా కోసం బ్రహ్మాజీ తనకు తెలిసిన అన్ని పరిచయాలను వాడేశాడు. బట్ బజ్ మినిమంగా కూడా క్రియేట్ కాలేదు. టైటిల్ తో ఆకట్టుకుంటాం అనుకున్నారు కానీ.. అదే పెద్ద మైనస్ గా మారింది. నిజానికి ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఎంటర్టైనింగ్ గానేఉంది. కానీ పోస్టర్ వాల్యూ