షాకింగ్ న్యూస్ చెప్పిన శంకర్

భారతీయుడు … 1996లో వచ్చిన సినిమా. కమల్ హాసన్ డ్యూయొల్ రోల్, శంకర్ డైరెక్షన్, స్వాంతంత్ర్య పోరాటం, అవినీతి అంటూ అనే అంశాల్లో అద్భుతం అనిపించుకున్న సినిమా. కమల్ తో పాటు శంకర్ కెరీర్ లో కూడా ఇదో స్పెషల్ మూవీ అనే చెప్పాలి.

\కమల్ కు వేసిన ఓల్డ్ మేన్ మేకప్ అప్పట్లో ఓ సెన్సేషన్. ప్రోస్థటిక్ అనే మాట కూడా అప్పటికి ఇండియన్ సినిమా వినలేదు. బట్ శంకర్ మ్యాజిక్ చేశాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ సోయగాలు, ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం మరో హైలెట్ గా నిలిచాయీ సినిమాకు. ప్రధానంగా సేతుపతి స్వాతంత్ర్యపోరాటం ఎపిసోడ్ అయితే మెస్మరైజింగ్ అనేచెప్పాలి. అందుకే ఈ చిత్రానికి కల్ట్ స్టేటస్ ఇచ్చారు ఆడియన్స్. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ మొదలుపెట్టారు కమల్ అండ్ శంకర్.

27యేళ్ల తర్వాత సీక్వెల్ అంటే అప్పట్లోనే కమల్ హాసన్ ను ఓల్డ్ మేన్ గా చూపించారు. ఇప్పుడు ఇంకా ముసలివాడి గెటప్ లో అంటే ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. భారతీయుడు2 అంటూ మొదలైన ఈ సినిమా గురించే ఇలా మాట్లాడుకుంటే శంకర్ నుంచి మరో షాకింగ్ అప్డేట్ వచ్చింది.


2017లోనే ఈ సినిమా అనౌన్స్ అయింది. 2019లో ప్రారంభం అయింది. అప్పట్లోనే చెన్నై, రాజమండ్రి, భోపాల్ లలో కొంత భాగం చిత్రీకరించారు. బట్ ఓ ప్రమాదంలో కొంతమంది క్రూ మెంబర్స్ చనిపోయారు. ఆ కేస్ అలా ఉండగానే కరోనా వచ్చింది. దీంతో శంకర్ రామ్ చరణ్ తో సినిమా స్టార్ట్ చేశాడు. ఇది కరెక్ట్ కాదు అని నిర్మాతలు కోర్ట్ కు వెళ్లారు. చరణ్ సినిమా రెండు షెడ్యూల్స్ అయిన తర్వాత శంకర్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో మళ్లీ భారతీయుడు2ను స్టార్ట్ చేశాడు శంకర్.


అయితే అంతా అనుకుంటున్నట్టు ఈ చిత్రం కేవలం రెండు భాగాలు కాదు. మూడు భాగాలుగా ఉంటుందట. యస్.. మీరు విన్నది కరెక్టే. ఈ సినిమాకు థర్డ్ పార్ట్ కూడా ఉంది. అంటే భారతీయుడు-3 అన్నమాట. ఇప్పటికే మూడో భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా చేస్తున్నారట.సెకండ్ పార్ట్ ను 2024 సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. థర్డ్ పార్ట్ కోసం ఒక యేడాది గ్యాప్ ఇస్తారట. అసలే ఫస్ట్ పార్ట్ లోనే కమల్ 70యేళ్ల వృద్ధుడుగా నటించాడు.

27యేళ్ల తర్వాత అంటే ఆయనకు 97యేళ్లు అనుకోవాలి. మరి మూడో పార్ట్ కోసం ఇంకెంత టైమ్ తీసుకుంటారు. అసలు ఇది ఈ టైమ్ లో నడిచే కథేనా లేక 90ల్లోనే సాగుతున్నట్టుగా ఉంటుందా అనేది పెద్ద సందేహంగా మారింది. ఇక మూడో పార్ట్ లో కమల్ ఉండొచ్చు లేకపోవచ్చు అంటున్నారు. అతను తన పోరాటాన్ని కొత్త తరానికి ఇచ్చి రెండో భాగంలోనే లేక మూడో భాగం మొదట్లోనే ఆ పాత్రకు ఒక ఎండ్ ఇస్తారు అనే ప్రచారం కూడా ఉంది. మొత్తంగా శంకర్ భలే షాక్ ఇచ్చాడు.

Related Posts