రూల్స్ రంజన్ కోసం పవన్ కళ్యాణ్ వస్తున్నాడా..

పవన్ కళ్యాణ్ ఒక ఫంక్షన్ కు అటెండ్ అవుతున్నాడు అంటే ఆ క్రేజ్ వేరే ఉంటుంది. ఆ సినిమాపైనా అంచనాలు మారతాయి. కాకపోతే ఆయన రావడం చివరి క్షణం వరకూ గ్యారెంటీ ఉండదు. అంత బిజీగా ఉంటున్నారాయన. అయితే ఈ సారి రూల్స్ రంజన్ కోసం రావడం పక్కా అని మాత్రం తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి రత్తినం కృష్ణ దర్శకుడు. ఏఎమ్ రత్నం ప్రెజెంటర్. ఇదే పవన్ రావడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. దర్శకుడు ఏఎమ్ రత్నం తనయుడే కావడం విశేషం.

ఏఎమ్ రత్నం నిర్మించిన ఖుషీ సినిమాతోనే పవన్ కళ్యాణ్ తిరుగులేని పాపులారిటీ వచ్చింది. అంతకు ముందు, తర్వాత ఎన్ని హిట్స్ ఉన్నా.. ఖుషీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ మధ్య మళ్లీ విడుదల చేసినా రికార్డ్ కలెక్షన్స్ తెచ్చుకుందీ చిత్రం. తర్వాత వీరి కాంబోలో వచ్చిన బంగారం పెద్దగా ఆకట్టుకోలేదు. మళ్లీ ఇన్నాళ్లకు హరిహర వీరమల్లు అనే పీరియాడిక్ ఫిక్షనల్ మూవీ స్టార్ట్ అయింది. క్రిష్ డైరెక్షన్ లో రావాల్సిన ఈ చిత్రం బాగా ఆలస్యం అయింది. రెండు మూడుషెడ్యూల్స్ చిత్రీకరణ జరుపుకుంది. కానీ 20శాతం చిత్రీకరణ కూడా పూర్తి కాలేదు. అయినా ఏఎమ్ రత్నం ఓపిగ్గా మళ్లీ పవన్ డేట్స్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బాధను పోగొట్టేందుకే పవన్ కళ్యాణ్ ఈ రూల్స్ రంజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కుగెస్ట్ గా రాబోతున్నాడు అనేది టాలీవుడ్ అనాలిసిస్.


ఎవరి కారణాలు వారికి ఉన్నా.. నిజంగా పవన్ కళ్యాణ్ వస్తే అది ఖచ్చితంగా రూల్స్ రంజన్ కపుల్ కిరణ్ అబ్బవరం, నేహాశెట్టికి పెద్ద ప్లస్ అవుతుంది. పవన్ వచ్చిన కారణంగా సినిమాకు మంచి హైప్ వస్తుంది. ఆ హైప్ ఓపెనింగ్స్ కు ఉపయోపడుతుంది.

సినిమాకు మంచి టాక్ వస్తే హిట్ అవడం పెద్ద కష్టమేం కాదు. ఇక ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కాబోతోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 లేదా 3 తారీఖుల్లో ఉంటుందంటున్నారు.

Related Posts