మేడ్ ఇన్ ఇండియా అంత సులువా జక్కన్నా

భారతదేశం.. విభిన్న మతాలు, భాషల సమ్మేళనం. ఛా.. ఈ మాత్రం మాకు తెలియదా అనుకుంటున్నారా.. నిజమే. మరి అలాంటప్పుడు ఇన్ని విభిన్నతల నుంచి ఒక్క వాదాన్ని క్రియేట్ చేయడం సులువా అంటే.. ఇంపాజిబుల్ అంటాం. అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ తో మరోసారి అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా జెండా ఎగరేసిన రాజమౌళి నెక్ట్స్ మహేష్ బాబు తో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ లోగా ఒక సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా బయోపిక్ గా చెబుతున్నాడు రాజమౌళి.
ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. అయితే ఇది ఇండియన్ సినిమా బయోపిక్ అనడం వెనక కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయనుకోవచ్చు. ఇండియన్ సినిమా అనే మాటే మనకు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కోభాషా చిత్రం ఒక్కో దశలో ఎదిగింది.

అంటే ఎలా చూసినా బాలీవుడ్ నుంచే మొదలు కావాలి. ముందు బొంబాయి, తర్వాత కోల్ కతా, ఆ తర్వాత మద్రాస్ నగరాలు ఇండియన్ సినిమాకే సెంటర్ పాయింట్స్ గా ఉండేవి. మొదటి మూకీ, టాకీ వచ్చింది బొంబాయిలోనే. అటుపై కోల్ కతా. ఆ తర్వాతే తెలుగు వారు భక్త ప్రహ్లాద అనే టాకీ తీశారు. అఫ్‌ కోర్స్ దీనికి ముందు మనవాళ్లూ కొన్ని టాకీస్ తీసి టాకీస్ లలో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో నడిపించారు. ఆ తర్వాత మద్రాస్ కేంద్రంగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల పరిశ్రమలు ఎదిగాయి. అటు బొంబాయి కేంద్రంగా మరాఠీ సినిమా ఎదిగింది. కోల్ కతా నుంచి బంగ్లా వరకూ సినిమా అభివృద్ధి అయింది. ఇలా చూసుకుంటే ఇప్పుడు ఇండియన్ సినిమా బయోపిక్ అని దేని గురించి చర్చిస్తారు. అలా చర్చించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా హిందీ సినిమానే మనకు మొదలు అని చెప్పాల్సి ఉంటుంది. ఇది ఇప్పటికే భాషా భేదాలు రేపుతూ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న ఒక పార్టీకి అనుకూలంగా ఉంటుందనే కదా అర్థం.


లేదా ఒక్కో భాషా చిత్రం ఎలా ఎదిగింది అని చెప్పాలంటే అప్పుడు ఇండియన్ సినిమా బయోపిక్ అనలేం. నిజానికి ఇప్పుడేదో మనం ప్యాన్ ఇండియన్ సినిమాలు అంటున్నాం కానీ.. కొన్నాళ్ల క్రితం వరకూ ఒక భాషా చిత్ర మరో భాషలో పెద్దగా ఆకట్టుకోలేదు. ఓవో యూనిక్ గా ఉన్న కొన్ని సినిమాలు తప్ప.. దశాబ్దంన్నర క్రితం వరకూ ఏ భాష సినిమా ఆ భాష వరకే గొప్ప అనిపించుకుంది. సో.. ఇండియన్ సినిమా ఓ జపనీస్, చైనీస్, ఇరానియన్‌, ఇంగ్లీష్‌ లాగా ఒకే భాష ఉన్న దేశాలకు సరిపోతుంది తప్ప.. ఇలా విభిన్నమైన భాషలున్న మన దగ్గర దీన్ని కలిపి చెప్పడం అంటే ఖచ్చితంగా ఏదో ఒక భాషను హైలెట్ చేయడం..అవుతుంది.


మరి ఇంత చిన్న లాజిక్ రాజమౌళికి తెలియదా అంటే తెలుసు. కానీ ఆయన తండ్రి పోకడ చూసిన ఎవరైనా ఈ ప్రయత్నం ఎవరి మెప్పుకోసం చేస్తున్నారో సులువుగానే అర్థం చేసుకుంటారు. రాజమౌళి కేవలం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంత మాత్రాన ఆయనకేం తెలియదు అనుకోవడానికి లేదు. సింపుల్ గా వాళ్లు విడుదల చేసిన టీజర్ లోనే ఒక మాట ఉంది. ఇండియన్ సినిమా ఎన్నో బయోపిక్స్ కు సాక్ష్యంగా నిలిచింది అన్నాడు. ఆ బయోపిక్స్ అన్నీ ఎవరి భాషలో వారికి తెలిసినవే ఉన్నాయి. భాగ్ మిల్కా భాగ్, ఇందిర, గాంధీ వంటి వారివి తప్ప.. మిగతావన్నీ ఆయా ప్రాంతాలకు చెందిన వ్యక్తులవే. మన ఎన్టీఆర్ బయోపిక్ బెంగాల్ వాళ్లకు నచ్చదు. తమిళ్ అన్నాదురై బయోపిక్ ముంబై వాళ్లకు నచ్చదు. సో.. ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా బయోగ్రఫీగా ఎలా మలుస్తారు అనే పెద్ద ప్రశ్న మాత్రం వెంటాడుతూనే ఉంటుంది.. కనీసం సినిమా వచ్చే వరకూ.

Related Posts