విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె మీరా(17) ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం తను ఇంటర్మీడియొట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. మీరా కొన్నాళ్లుగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందట. అది చదువు వల్లనా లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. అయితే అంత పెద్ద ఫ్యామిలీకి చెందిన తను ఆత్మహత్య చేసుకోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

సెలబ్రిటీస్ పిల్లలు అంటే కేవలం చదువు ఒత్తిడికి మాత్రమే తలొంచరు. కావాలంటే వాళ్లు చదువులు మానేసి పేరెంట్స్ తో కలిసి ఇండస్ట్రీలోనే ఏదో ఒక క్రాఫ్ట్ లో సెటిల్ కావొచ్చు. కానీ ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిడికి తను గురైందంటే ఇంకేవైనా కారణాలున్నాయా అనే దిశగా ఆలోచిస్తున్నారు.


ఏదేమైనా విజయ్ దంపతులకు కూతురంటే చాలా ఇష్టం అని చెబుతారు. ఎన్నోసార్లు ఆ పాపను కూడా తన సినిమా ఫంక్షన్స్ కు తీసుకువచ్చాడు విజయ్. తన మ్యూజికల్ ప్రోగ్రామ్స్ లోనూ పాపను చిన్నతన నుంచి తీసుకువచ్చేవాడు. విజయ్ ఆంటోనీ ఇంట్లో జరిగిన ఈ విషాదం ఆయన కుటుంబాన్ని కుంగదీస్తుందనే చెప్పాలి. ఈ బాధాకర సమయంలో ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుణ్ని కోరుకుందాం.

Related Posts