మరోసారి తెలుగులో సల్మాన్ ఖాన్ తమ్ముడు

సల్మాన్ ఖాన్ తమ్ముడుగానే కాకుండా విలక్షణ నటుడిగానూ అర్భాజ్ ఖాన్ కి మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన అర్భాజ్.. చిరంజీవి ‘జై చిరంజీవ’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత అర్భాజ్ తెలుగులో నటించబోతున్నాడు. యంగ్ హీరో అశ్విన్ బాబు నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అప్సర్ దర్శకత్వం వహిస్తున్నాడు. న్యూ ఏజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీలో అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ నటిస్తుంది. ఇంకా.. ఇతర కీలక పాత్రల్లో ‘హైపర్’ ఆది, తమిళ నటుడు సాయి ధీన నటిస్తున్నారు.

Related Posts