ఫిబ్రవరి 16న ‘ఊరు పేరు భైరవకోన’

సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రానికి కొత్త విడుదల తేదీ ఖరారయ్యింది. అసలు ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం.. రవితేజ ‘ఈగల్’ సోలో రిలీజ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఫిబ్రవరి 16న ‘ఊరు పేరు భైరవకోన’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీని తెలుపుతూ చిత్రబృందం కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన అంటూ ట్రైలర్ తో ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో సందీప్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ కథానాయికలుగా నటించారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంస్థల పై రాజేష్ దండా, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చాడు.

Related Posts