మరోసారి నాని-వివేక్ ఆత్రేయ

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం తన 30వ చిత్రంగా ‘హాయ్ నాన్న‘ను విడుదలకు ముస్తాబు చేస్తున్నాడు నాని. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తన 31వ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘అంటే సుందరానికి‘ సినిమా వచ్చింది. ఈ మూవీ డీసెంట్ ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. అందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

అక్టోబర్ 24న నాని-వివేక్ ఆత్రేయ చిత్రం ముహూర్తాన్ని జరుపుకోనుంది. వెరైటీ టైటిల్స్ ను పెట్టడానికి ఇష్టపడే వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి ‘సరిపోదా శనివారం‘ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడట. ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తుంది. మొదట ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహమాన్ పేరు వినిపించింది. కానీ.. తన గత చిత్రాలకు పనిచేసిన వివేక్ సాగర్ వైపే మొగ్గుచూపుతున్నాడట వివేక్ ఆత్రేయ. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య కనిపించనున్నట్టు తెలుస్తోంది.

Related Posts