కమల్ హాసన్ క్లాసిక్ మళ్లీ వస్తోంది

భారతీయ సినిమా చరిత్రలో కమల్ హాసన్-మణిరత్నం ‘నాయకుడు‘ చిత్రానిది ప్రత్యేక స్థానం. 1987లో విడుదలైన ఈ సినిమాతో కమల్ హాసన్ కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కింది. అంతే కాదు.. ఆ యేడాది ఇండియా నుంచి ఆస్కార్ కి ఎంపిక చేయబడ్డ చిత్రంగానూ ‘నాయకుడు‘ నిలిచింది. ఇక.. టైమ్స్ మేగజైన్ ఆల్ టైమ్ హండ్రెడ్ బెస్ట్ మూవీస్ లోనూ ఒకటిగా ఈ చిత్రం నిలిచింది.

ప్రస్తుతం తెలుగునాట పాత సినిమాల రీ రిలీజుల ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడిది తమిళ చిత్ర పరిశ్రమకు కూడా పాకింది. కమల్ హాసన్-మణిరత్నం ‘నాయకుడు‘ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 3న ఈ సినిమాని 4కె వెర్షన్ లో విడుదల చేయబోతున్నారు. అయితే.. కేవలం తమిళ వెర్షన్ మాత్రమే రీ రిలీజ్ అవుతోంది. తెలుగు వెర్షన్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

మరోవైపు ‘విక్రమ్‘ విజయం తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్ జోరు మామూలుగా లేదు. ఒకవైపు శంకర్ డైరెక్షన్ లో ‘ఇండియన్2‘ని శరవేగంగా కంప్లీట్ చేస్తున్న కమల్.. మరోవైపు మణిరత్నం సినిమాని పట్టాలెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. కమల్ హాసన్ 234వ చిత్రంగా మణిరత్నం సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Related Posts