HomeMoviesటాలీవుడ్మెస్మరైజింగ్ గా ‘మంగళవారం‘ ట్రైలర్

మెస్మరైజింగ్ గా ‘మంగళవారం‘ ట్రైలర్

-

‘ఆర్.ఎక్స్. 100‘ సినిమాతో ఓ సెన్సేషనే సృష్టించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. కార్తికేయ రస్టిక్ క్యారెక్టరైజేషన్, పాయల్ రాజ్ పుత్ అందాలు.. ముఖ్యంగా పాటల్లో అజయ్ భూపతి టేస్ట్ స్పష్టంగా కనిపించింది. అన్నీ కలగలిసి ‘ఆర్.ఎక్స్.100‘ని సూపర్ హిట్ చేశాయి. ఆ తర్వాత ‘మహాసముద్రం‘ సినిమాతో మల్టీస్టారర్ ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈసారి మాత్రం ‘మంగళవారం‘ సినిమాతో హిట్ కొట్టేటట్టే ఉన్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి.

‘ఆర్.ఎక్స్.100‘ సినిమాతో కుర్రకారుకు మోస్ట్ ఫేవరెట్ గా మారిన పాయల్ రాజ్ పుత్ ‘మంగళవారం‘ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల అమీర్, రవీంద్ర విజయ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ‘మంగళవారం‘ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఓ గ్రామంలో మంగళవారమే హత్యలు జరుగుతుండడం మిస్టరీగా మారుతోంది. అసలు ఆ హత్యలు వెనుక ఎవరున్నారు? అనే ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ పాత్రలో నందిత శ్వేత ఎంటరవుతోంది. అక్కడ నుంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంతం పరుగులు పెట్టించేలా ఉంది. సాఫ్ట్ రోల్స్ లో కనిపించే చైతన్య కృష్ణ ఈ మూవీలో పూర్తి నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక.. అజ్మల్ అమీర్ పాత్రను ట్రైలర్ లో రివీల్ చేయలేదు.

ట్రైలర్ లో ఫైనల్ గా ప్రధాన పాత్రైన పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఉంది. ‘ఆర్.ఎక్స్.100‘లో పాయల్ ఏ విధంగా అందాల విందు చేసిందో.. అంతకు మించి అన్నట్టు ఈ మూవీలో బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. అయితే.. పాయల్ క్యారెక్టర్ లో ఓ పెయిన్ కూడా ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ‘కాంతార, విరూపాక్ష‘ సినిమాలను తన బి.జి.ఎమ్. తో నిలబెట్టేసిన అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ ‘మంగళవారం‘కి మరో ప్రధాన బలంగా కనిపిస్తుంది. ముద్ర మీడియా వర్క్స్, ఎ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై స్వాతి రెడ్డి గునపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నవంబర్ 17న పలు భాషల్లో ‘మంగళవారం‘ విడుదలకు ముస్తాబవుతోంది.

ఇవీ చదవండి

English News