గుప్త నిధుల అన్వేషణే ‘ఓం భీమ్‌ బుష్’ – దర్శకుడు హర్ష కొనుగంటి

హుషారు ఫేమ్‌ హర్ష కొనుగంటి డైరెక్షన్‌లో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తున్న చిత్రం ‘ఓం భీమ్‌ బుష్’. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ వైడ్‌గా మార్చి 22 న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


ఒకప్పుడు బ్యాంకులు లేనప్పుడు మన దగ్గర వున్న డబ్బు,బంగారం ఒక బిందెలో పెట్టి భూమిలో దాచేవారు. ఈ కథలో యూనిర్సిటీలో చదువుకున్న ముగ్గురు ఓ గ్రామంలో అలాంటి గుప్తనిధుల కోసం చేసిన అన్వేషణ ఎలా జరిగిందనేది చాలా క్రేజీగా చూపించడం జరిగింది. ‘ఓం భీమ్ బుష్’ అనేది ఓ మ్యాజికల్ ఫ్రేజ్. చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు కూడా సరదా ఆ మాట వాడుతుంటారు. ఈ కథలో కూడా చాలా మ్యాజిక్ వుంటుంది. పారానార్మల్ యాక్టివిటీస్, ఆత్మలు, లంకె బిందెలు ఇలాంటి మిస్టీరియస్ ఎలిమెంట్స్ వుంటాయి. ఈ కథకు ‘ఓం భీమ్ బుష్’ అనేది యాప్ట్ టైటిల్ అన్నారు హర్ష.
పెద్ద యూనిర్సిటీలలో ముఫ్ఫై ఏళ్లకు దాటిన వారు కూడా ఏదో పీహెచ్డీ చేస్తూ అక్కడే వుంటారు. ఇందులో ముగ్గురు కూడా అలా యూనివర్సిటీలో రిలాక్స్ గా వుండేవారే. అలాంటి ముగ్గురు బయటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది కథ అన్నారు. ఈ కథలో చాలా లాజిక్ వుంటుంది. ప్రతి సన్నివేశం లాజిక్ తో ముడిపడి వుంటుంది. ఇందులో చాలా బలమైన కథ వుంది. కానీ ఇప్పుడు రివిల్ చేయడం లేదు. ఈ సినిమాకి కథే హైలెట్. ఇందులో మంచి ఎమోషన్ కూడా వుంది. అది చాలా కొత్తగా వుంటుందన్నారు. ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రియ వడ్లమాని స్పెషల్ అప్పీరియన్స్ వుంటుంది. కామాక్షి భాస్కర్ల మరో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారన్నారు.


సామజవరగమన కంటే పదిరెట్ల కామెడీ ఈ సినిమాలో ఉంటుందన్నారు.
వంశీ అన్న బెస్ట్ ప్రొడ్యూసర్. చాలా స్వేఛ్చ ఇచ్చారు. అలాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. వారి సపోర్ట్ వలనే ఇంత డిఫరెంట్ క్రేజీ మూవీ చేయగలిగామన్నారు.
ఇప్పటివరకూ సినిమా చూసినవారంతా చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. బిజినెస్ కూడా పెద్ద రేంజ్ లోనే జరిగింది. తప్పకుండా మ్యాజిక్ క్రియేట్ అవుతుందనే అనుకుంటున్నామన్నారు ఈ చిత్ర దర్శకుడు హర్ష కొనుగంటి.

Related Posts