నేను ముస్లింలకు కాదు.. ఏడో నిజామ్‌కి వ్యతిరేకం

యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ మార్చి 15న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత గూడూరి నారాయణ రెడ్డి మీడియా మిత్రులతో ముచ్చటించారు.


హిందువుల మీద ఊచకోత జరిపిన ఆ నిజామ్‌ రాజు బయట ప్రపంచంలో మంచి వ్యక్తిగా చలామణి అయ్యాడు. ఓ యూనివర్శిటీ కట్టాడు. ఆసుపత్రి కట్టాడు. ఏ రాజూ ఇంత పెద్దగా కట్టలేదన్న మాట ఉంది కట్టిన మాట వాస్తవమే. కానీ, వాళ్ల తాత జాగీరులో కట్టలేదు. జనాలు కట్టిన సర్కారు రకంతో కట్టాడు. ఆ రోజుల్లో భూమి శిస్తు, పుడితే శిస్తు, చస్తే శిస్తు, ఆడపిల్లయితే శిస్తు, మగపిల్లాడైతే శిస్తు అని చాలానే ఉండేవి. వాటితో వచ్చిన డబ్బులతో కట్టాడు. మరి అంత మంచివాడైతే హిందువులను ఊచకోత కోయాలనే దుర్బుద్ధి ఎందుకు పుట్టింది? దాన్ని చెప్పాలి కదా… ఇవాళ హిస్టరీ ఏ రూపంలోనైనా ఉండొచ్చు. చరిత్ర అనేది పుస్తకాల్లో ఉండొచ్చు. పబ్లిక్‌ డొమైన్లలో ఉండొచ్చు. సినిమాల రూపంలో ఉండొచ్చు. నేను సినిమా చేశాను అన్నారు.. అలాగే ఏడో నిజామ్‌ హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశం గా చేయాలనీ, తుర్కిస్తాన్‌, ఉస్మానిస్తాన్ అనే పేర్లు పరిశీలించారు.. అయితే బ్రిటీష్ వారి దగ్గరకు వెళ్తే ప్రత్యేక కమ్యూనిటీ ఉంటేనే ప్రత్యేక దేశం చేయొచ్చన్నారు. దాంతో అందరినీ మతమార్పిడీ చేయాలని చూసారు. అందుకోసం హత్యలు, మానభంగాలు ఒకటేమిటి అన్ని రకాల అరాచకాలు చేసారన్నారు. ఆనాటి చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలు చూపామన్నారు.
నేటి భారతదేశంలో దాదాపు వంద కోట్లకుపైగా యంగ్ జనరేషన్ ఉన్నారు. వారికి నాటి చారిత్రక సంఘటనలు తెలీవు. వాళ్ల వంశంలో అమ్మమ్మకో, తాతయ్యకో, నాయనమ్మకో రజాకార్‌ల హింస జరిగిఉండొచ్చు. వారికి ఆనాటి చరిత్ర తెలియాలనే ఈ సినిమా తీసాను. తాను బీజేపీలో ఉండటం వల్లనే రాజకీయపరమైన వ్యక్తిగత కక్ష్య వల్లే ఈ సినిమా కాంట్రవర్శీకి గురయ్యిందన్నారు. – 13 కోట్ల మంది భాజపా రిజిస్టర్డ్ కార్యకర్తలున్నారు. వీళ్లు ఒక్కొక్కరు నాలుగు ఓట్లు, మూడు ఓట్లు తెచ్చినా ఎన్ని కోట్ల ఓట్లు వస్తాయో మీకు తెలుసు. అందువల్ల, ఈ చిన్న సినిమా, డాక్యుమెంటరీ తీసి క్యాష్‌ చేసుకోవాల్సిన అవసరం పార్టీకి లేదు. నేను ఎక్కడున్నా ఈ సినిమా చేసేవాడినన్నారు.


ఈ సినిమాను రజాకార్ల వారసులే వ్యతిరేకిస్తున్నారు.. నిజమైన ముస్లింలు అపోజ్‌ చేయడం లేదన్నారు. హిందూ ముస్లిం అందరూ సమానమే.. అందరం భరతమాత ముద్దు బిడ్డలమే అన్నారు.
మొన్నటిదాకా మూడక్షరాల కచడా పాలించింది. హమామ్‌ ఖాన్‌లో పడ్డారు వాళ్లు. అక్కడ పడ్డోడికి సీన్‌ కట్‌ అవుతుంది. గోల్కొండ మీద జెండా ఎగరేయడమేంటి? విమోచన దినం ఎవరూ జరపలేదు. భాజపా పార్టీ మూడేళ్లుగా అమిత్‌షా వస్తున్నారు. సెప్టెంబర్‌ 17న ఆయనే మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌కి జాతిపిత సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌. నెహ్రూ ఎందుకు అన్ని రోజులు వెయిట్‌ చేశారో తెలియజెప్పాలి కదా… అది మా సినిమా ద్వారా చెప్పారు. లక్కీగా కాంగ్రెస్‌ వాళ్లు దీని గురించి పెద్దగా మాట్లాడలేదు. మేం మంచి ఉద్దేశంతో సినిమా చేశామన్నారు.


ప్రతి పాత్రకూ ఆయన న్యాయం చేశారు. 16 కోట్లన్నారు.. ఇప్పుడు 50 దాటింది. దానివల్ల ఇబ్బంది అయింది కానీ, టాప్‌ క్వాలిటీ ఉంది. పెద్ద కేరక్టర్లు, డైరక్టర్‌, ప్రొడ్యూసర్‌ లేరు కానీ, బాహుబలికి ఏమీ తక్కువ కాదు ఈ సినిమా. ఒక్కొక్కరోజు 900 మంది జూనియర్‌ ఆర్టిస్టులను వాడాం. భీమ్స్ మ్యూజిక్‌, శంకర్‌ మహదేవన్‌, ఖైలాష్‌ ఖేర్‌, మోహన భోగరాజు పాడిన పాటలు గుండెకు గుచ్చుకుంటాయి. ఆ పాటలు సినిమాలో చూస్తే ఎక్కి ఎక్కి ఏడుస్తారు. మా అమ్మకు 83 ఏళ్లున్నాయి. ఆమెకు ఏడేళ్లట అప్పుడు. అప్పుడు వాళ్ల అక్క దగ్గరకి ముంబైకి పంచారు. మా తాత గూడూరు నారాయణరెడ్డి… గూడూరు గ్రామంలో ఆయన చేసిన విషయాలు ఇంకా చెప్పుకుంటారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
నేను ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. నేను మళ్లీ చెబుతున్నా. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏడో నైజామ్‌కి నేను వ్యతిరేకం. అలాంటి ఘటన ఎప్పుడూ ఎక్కడా లేదు. మన దగ్గరే జరిగింది. అదే చూపించామన్నారు.

Related Posts