హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముంబై నుంచి తిరిగి వచ్చాడు. బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2’ కోసం ముంబై వెళ్లిన తారక్.. కొన్ని రోజుల పాటు ఆ మూవీ చిత్రీకరణలో పాల్గొన్నాడు. గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ తో కలిసి ఒక పాట, కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నాడట తారక్. ‘వార్ 2’ షూట్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా పాల్గొంది. ఆమధ్య తారక్ తో తను తీసుకున్న ఓ సెల్ఫీని ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు ఎన్టీఆర్.

ప్రస్తుతం ‘దేవర’కి సంబంధించి కొంచెం ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత మళ్లీ ‘వార్ 2’ సెట్స్ లో జాయిన్ అవుతాడట ఎన్టీఆర్. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వార్ 2’ని బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. 2025, ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ‘వార్ 2’ రాబోతుంది.

Related Posts