కథలోనే కాదు క్యారెక్టర్‌లో కూడా మల్టిపుల్ లేయర్స్‌ ఉన్నాయి – నవీన్‌ చంద్ర

డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. అమోజాన్ ఒరిజినల్ గా “ఇన్స్ పెక్టర్ రిషి” ఈ నెల 29వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. నవీన్ చంద్ర లీడ్ రోల్ చేయగా.. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రెస్‌మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.


“ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ లో నేను సత్య అనే ఫారెస్ట్ రేంజర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఇది. మీకు తప్పకుండా నచ్చుతుందన్నారు నటుడు శ్రీ కృష్ణ దయాల్ .
సిరీస్ లో నేను అయ్యనార్ అనే ఇన్సిపెక్టర్ రోల్ లో నటించాను. పది ఎపిసోడ్ల సిరీస్ ను డైరెక్టర్ నందిని గారు ఎంతో ఆసక్తికరంగా రూపొందించారు. చాలా పార్ట్ అడవిలో షూటింగ్ చేశాంమన్నారు నటుడు కన్నా రవి.
నాకు చిన్నప్పటి నుంచి హారర్ మూవీస్ చూడటం, హారర్ బుక్స్ చదవడం ఇంట్రెస్ట్. అలా హారర్ సబ్జెక్ట్ రెడీ చేసుకుని ఈ సిరీస్ చేశాను. ఈ సిరీస్ కథలో ఏ కులాన్నీ, మతాన్నీ, ఎవరి విశ్వాసాలను కించపరిచేలా సన్నివేశాలు ఉండవన్నారు డైరెక్టర్ నందిని జెఎస్‌. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు సినిమా వరల్డ్ సినిమా అయ్యింది. సాగరసంగమం నా ఫేవరేట్ తెలుగు మూవీ. “ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ ను మొదట మేము తమిళం వరకే చేద్దామని అనుకున్నాం. కానీ మేకింగ్ అయ్యాక మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నామన్నారామె.


ఈ కథలో నాకు మంచి రోల్ దొరికింది. ఫారెస్ట్ రేంజర్ గా కనిపిస్తాను. ఈ వెబ్ సిరీస్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి. హారర్, థ్రిల్లర్, రొమాన్స్, యాక్షన్, కామెడీ ఇలాంటివన్నీ కుదిరిన సిరీస్ ఇది. నవీన్ చంద్రతో వర్క్ చేయడం హ్యాపీగా ఉందన్నారు సునైనా. పాండమిక్ టైమ్ లో రాజ రాజ చోర సినిమా చేస్తున్నప్పుడు “ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ స్క్రిప్ట్ విన్నాను. వినగానే ఈ సిరీస్ తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యానన్నారామె.


ఇవాళ రామ్ చరణ్ గారి బర్త్ డే. ఆయన నా విశెస్ చెబుతున్నా. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆయన గ్రేట్ యాక్టర్. నేను హారర్ కంటెంట్ చేసి చాలా రోజులవుతోంది. “ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ కథ విన్నప్పుడు ఇందులో హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, యాక్షన్ …లాంటి అన్ని ఎమోషన్స్ ఉన్నాయనిపించింది. ఈ సిరీస్ ఎందుకు చేయకూడదు అని దూకేశాను. ఇలాంటి క్యారెక్టర్ దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ కథలోనే కాదు నా క్యారెక్టర్ లోనూ అనేక లేయర్స్ ఉంటాయన్నారు నవీన్ చంద్ర.

Related Posts