ఆస్కార్ ఉన్నత పురస్కారం అందుకున్న చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ విషెస్ తెలియజేసింది పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. మార్చి 27 న చెర్రీ బర్త్‌డే సందర్భంగా.. పాన్ ఇండియా వైడ్ గా
అనేకమంది ప్రముఖులు తమ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుండగా వారిలో తమ కుటుంబీకులు కూడా చేస్తున్న విషెష్ వైరల్ గా మారాయి. ఈ క్రమంలో
జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా చెర్రీకి చెప్పిన విషెస్ వైరల్ అవుతున్నాయి. చరణ్ చాలా గౌరవ మర్యాదలు, దైవ భక్తి మెండుగా కలవాడు అని అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడంలో చరణ్ విద్యార్థిలా శిక్షణ తీసుకుంటాడు అని తండ్రికి తగ్గ తనయుడుగా చరణ్ ముందు రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటున్నాను అని తన విషెస్ పోస్ట్ చేసారు పవన్ కళ్యాణ్.