టామ్ క్రూస్ కు షాక్ ఇచ్చిన నోలాన్, బార్బీ

మిషన్ ఇంపాజిబుల్ 7 (డెడ్ రికనింగ్ పార్ట్ వన్) ఇండియాలో కూడా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా ప్రారంభమైన దగ్గర్నుంచి నిత్యం వార్తల్లోనే ఉంటూ వచ్చింది. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో ఈ సినిమా గురించి తెగ మాట్లాడుకున్నారు.

ట్రైలర్ వచ్చిన తర్వాత మస్ట్ వాచ్ లిస్ట్ లో వేసుకున్నారు ఆడియన్స్. 60ఏళ్ల వయసులో కూడా టామ్ క్రూస్ చేసిన సాహసాలు, విన్యాసాల గురించి ప్రపంచం అంతా ఆశ్చర్యంగా మాట్లాడుకుంది. అతనికి ఎంత ప్యాషన్ లేకపోతే ఈ వయసులో ఆ సాహసాలు చేస్తాడు అనుకున్నారు. అందుకే సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక మాస్ మూవీస్ కు పట్టం కట్టే ఇండియాలో కూడా అదే రేంజ్ లో ఓపెనింగ్స్ తెచ్చుకుంది మిషన్ ఇంపాజిబుల్.

అయితే ఈ మూవీ రెండు వారాల్లోనే వంద కోట్ల మార్క్ ను దాటుతుందనుకున్నారు చాలామంది. బట్ ఈ మూవీ వచ్చిన నెక్ట్స్ వీక్ కు క్రిస్టఫర్ నోలాన్ డైరెక్ట్ చేసిన ఓపెన్హైమర్, బార్బీ సినిమాలు విడుదలయ్యాయి. క్రిస్టఫర్ మూవీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. అది మన దేశంలోనూ కనిపించింది.

అయితే అనూహ్యంగా ఈ చిత్రానికి కూడా పోటీ ఇచ్చింది బార్బీ. బార్బీకి ఇండియాలో ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని మొదటిసారిగా అర్థమైంది. ఈ రెండు హాలీవుడ్ మూవీస్ వల్ల మరో హాలీవుడ్ మూవీ అయిన మిషన్ ఇంపాజిబుల్ వంద కోట్లమార్క్ ను టచ్ చేయడానికి తంటాలు పడుతోంది. అఫ్ కోర్స్ఈ మూడు సినిమాలూ ఇండియన్ మూవీస్ కూడా పై గట్టి ప్రభావాన్ని చూపించాయి.


మిషన్ ఇంపాజిబుల్ ఫస్ట్ వీక్ లో దుమ్మురేపినా నెక్ట్స్ వీక్ కు డల్ అయింది. అందుకే ఇప్పటి వరకూ కేవలం 92కోట్ల వరకూ మాత్రమే కలక్ట్ చేయగలిగింది.కానీ 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. కలెక్షన్స్ తగ్గాయి కానీ.. పూర్తిగా పడిపోలేదు.అయినా ఇంత పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ కు వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ కావడానికి ఇంత టైమ్ పట్టడం మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అయినా టామ్ క్రూజ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనేందుకు ఇది మరో ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు.

Related Posts