తెలుగు అమ్మాయిల హవా మొదలైందా

తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలివ్వరు. ఎంత టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేయరు. ప్లాస్టిక్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపించే ముంబై వాళ్లే మనవాళ్లకు ముద్దు అంటూ కొన్నాళ్లుగా ఆ మాటకొస్తే మూడు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. వినిపించడమే కాదు.. నిజం కూడా. తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నించి.. ఒకటీ అరా సినిమాలు చేసినా ఎవరూ పట్టించుకోక కోలీవుడ్ కు వెళ్లి జెండా ఎగరేసిన బ్యూటీస్ ను కూడా చూశాం.

అంజలి, శ్రీదివ్య, ఆనంది లాంటి హీరోయిన్లను చూశాం. వీరికి అక్కడ తిరుగులేని ఫ్యాన్ బేస్ కూడా ఉండటం విశేషం. ఓ దశలో మీడియం రేంజ్ సినిమాలకు టాప్ హీరోయిన్లుగా వెలిగారు వీళ్లు. బట్ తెలుగులో పట్టించుకున్నవాళ్లు లేరు అనే చెప్పాలి.

అంజలి ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆనంది ఆమధ్య శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయినా మనవాళ్లు తనను కన్సిడర్ చేయలేదు. ఇక ఈ లిస్ట్ లో తెలుగులో అవకాశాల కోసం స్ట్రగుల్ అయిన అవుతున్న బ్యూటీస్ లో నందిత రాజ్, ఈషా రెబ్బా, రీతూవర్మ,చాందిని చౌదరి,ప్రియా వడ్లమాని వంటి బ్యూటీస్ ఇప్పటికీ తెలుగులో తమకంటూ ఓ రోజు రాకపోతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు.


అయితే రోజులు మారినట్టుగా కనిపిస్తున్నాయిప్పుడు. తెలుగులో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించడం మొదలైనట్టు కనిపిస్తోంది.ఒకప్పుడు కావ్య కళ్యాణ్ రామ్ ను బాలనటిగా చూసినప్పుడు ముంబై అమ్మాయి అనుకున్నారు. కానీ తను తెలుగు(కొత్తగూడెం) అమ్మాయి. తను ఇప్పుడు హీరోయిన్ గా మారింది.

వరుస విజయాలతో దూసుకుపోతోంది. మంచి పర్ఫార్మర్ అనిపించుకుంటూనే గ్లామర్ విషయంలోనూ తగ్గేదే లే అన్నట్టుగా ఉంది. హీరోయిన్ గాఫస్ట్ మూవీ మసూద బ్లాక్ బస్టర్. ఆ తర్వాత వచ్చిన బలగం బ్లాకెస్ట్ బస్టర్. త్వరలో రాబోతోన్న ఉస్తాద్ సినిమా కూడా ప్రామిసింగ్ గాకనిపిస్తోంది. ఇది కూడా హిట అయిత అమ్మడు హ్యాట్రిక్ బ్యూటీ అవుతుంది. ఇక మీడియం రేంజ్ హీరోల నుంచి పిలుపులు రావడమే తరువాయి.


అందరికంటే ఈ మధ్య ఎక్కువగా ఆకట్టుకుంది.. వైష్ణవి చైతన్య. బేబీ సినిమాలో ఆ పాత్రను మామూలుగా తెలుగు వాళ్లు చేయడానికి సాహసం చేయరు. తను చేసింది. సూపర్ హిట్ అయింది. గ్లామర్ పరంగానూ, నటన పరంగానూ ది బెస్ట్ ఇచ్చింది.నిజంగా ఈ పాత్రను ఏ ముంబై బ్యూటీకి ఇచ్చినా.. గ్లామర్ పరంగా మార్కులు కొట్టేవారే కానీ.. నటనలో తేలిపోయేవారు. వైష్ణవి బేబీ పాత్రకు ప్రాణం పోసింది.

ఇప్పుడీ సినిమా అంత పెద్ద విజయం సాధించడంలో మేజర్ షేర్ తనదే అంటే తప్పేం కాదు. ఈ విజయంతో మొన్నటి వరకూ యూ ట్యూబ్ హీరోయిన్ గా ఉన్న తను సడెన్ గా బిజీగా మారింది. ఒకే సారి మూడు సినిమాలకు సైన్ చేసింది. ఈ మూడింటిలో రెండు విజయాలు వచ్చినా చాలు.. తను నెక్ట్స్ లీగ్ లోకి వెళ్లిపోతుంది. మరి ఇదే రూట్ లో ఇంకా కొత్త అమ్మాయిలు వస్తే.. ఖచ్చితంగా తెలుగు పరిశ్రమలో మళ్లీ తెలుగు హీరోయిన్ల హవా మొదలవుతుంది అనే చెప్పాలి.

Related Posts