సెంటిమెంట్ ను పండించబోతున్న నితిన్

వరుసగా ఫ్లాపులు వస్తున్నా.. అదే స్పీడ్ తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు నితిన్. గతేడాది తను భారీ అంచనాలు పెట్టుకున్న మాచర్ల నియోజకవర్గం సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అంతకు ముందు చేసిన రంగ్ దే కమర్షియల్ గా ఆకట్టుకోలేదు.

దానికి ముందు వచ్చిన భీష్మ మాత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.వక్కంతం వంశీ డైరెక్షన్ లో ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’ అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్. ఈ మూవీని ఈ యేడాది డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే డౌట్స్ నుంచి సడెన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యే వరకూ సైలెంట్ గా పని పూర్తి చేస్తోంది మూవీ టీమ్. ఈ సినిమా నితిన్ కెరీర్ లో ఓ వైవిధ్యమైన ప్రాజెక్ట్ అవుతుందంటున్నారు.


ఇక నెక్ట్స్ తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో మరో సినిమా చేస్తున్నాడు. మొదట ఈ చిత్రంలో రష్మిక మందన్నాను హీరోయిన్ గా తీసుకున్నారు. తను సడెన్ గా తప్పుకుంటే ఆ ప్లేస్ లోకి తాజాగా శ్రీ లీలను తీసుకున్నారు. ఈ రెండు సినిమాలూ ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక లేటెస్ట్ గా నితిన్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యాడు.కెరీర్ మొదటి నుంచి దిల్ రాజు క్యాంప్ లోనే ఎక్కువగా కనిపించే వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకుడు.


దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ నటించబోయే సినిమా కంప్లీట్ సెంటిమెంట్ తో నిండి ఉంటుందని సమాచారం. వేణు శ్రీరామ్ గతంలో తీసిన ఎమ్.సి.ఏలో ఒదిన మరిది మధ్య సాగే మంచి ఎమోషనల్ డ్రామాగా ఉంటుంది. ఈ సారి అక్కా తమ్ముడు మధ్య సాగే డ్రామా అంటున్నారు. ఇలాంటి సెంటిమెంట్ ను నితిన్ ఇంతకు ముందు గతంలో పండించలేదు.అందుకే అతనికి ఈ పాత్ర కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే నితిన్ ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేసి ఉన్నాడు.


చాలామంది ఈ సినిమా గతంలో వేణు శ్రీరామ్ అనౌన్స్ చేసిన ఐకన్ కథే అంటున్నారు. ఐకన్ ను అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడు వేణు. బట్ ఈ కథ వేరే అనేది స్పష్టంగా చెబుతున్నారు. అల్లు అర్జున్ కోసం అనుకున్న ఐకన్ కథ వేరే.. నితిన్ తో చేస్తోన్న కథ వేరే అన్నమాట. ఆ మేరకు ఓ క్లారిటీ అయితే ఉందంటున్నారు.

Related Posts