పవన్ కళ్యాణ్.. నెల రోజుల పాటు ఓ.జికే అంకితం

పవన్ కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులు ఆశిస్తోన్న సాలిడ్ ఎంటర్టైనర్ వచ్చి చాలాకాలం అయింది. అంటే గబ్బర్ సింగ్ తరహా సినిమా అన్నమాట. జల్సా లాంటివి అయినా ఫర్వాలేదు. ఈ లోటును తీర్చాలనే రీసెంట్ గా బ్రో సినిమాలో రకరకాల డైలాగ్స్ తో స్క్రీన్ ప్లే రాశాడు త్రివిక్రమ్. బట్ అది వర్కవుట్ కాలేదు. బట్ ఆ మధ్య ఒప్పుకున్న ‘ఓ.జి'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అవుతుందనే నమ్మకం ఇచ్చాడు దర్శకుడు సుజిత్.

ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ రఫ్ అండ్ టఫ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ మూవీ 50శాతం షూటింగ్ జరుపుకుందనే టాక్ ఉంది. అయితే ఈ 50శాతంలో పవన్ పోర్షన్ తక్కువ.కొన్నాళ్లుగా ఆయన సినిమాల కంటే వారాహి యాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతోనే దీంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ తరహా సినిమాలు లేట్ అయ్యాయి.. అవుతున్నాయి.అయినా ముందు ఒప్పుకున్న ఉస్తాద్ కంటే ఈ మధ్యే ఒప్పుకున్న ఓజికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే ఈ సినిమా కోసం ఏకధాటిగా ఓ నెల రోజుల పాటు టైమ్ ఇచ్చాడు.


సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే స్పెషల్ గా ఓజి నుంచి ఓ గ్లింప్స్ వస్తుంది. ఆ నెలంతా ఆయన పొలిటికల్ గా బిజీగా ఉంటారట. అయితే అక్టోబర్ లో ఏకధాటిగా 20రోజుల పాటు ఓజి షూటింగ్ కు డేట్స్ ఇచ్చాడు. ఈ ఇరవై రోజుల షూటింగ్ అంతా బ్యాంకాక్ లో జరుగుతుందని టాక్. ఈ మేరకు ప్రస్తుతం లొకేషన్స్ ను చూస్తోంది మూవీ టీమ్. ఆ తర్వాత నవంబర్ లో కూడా ఓ పది రోజుల పాటు డేట్స్ ఇచ్చాడు. ఈ డేట్స్ తో సినిమాకు సంబంధించి ఆయన పోర్షన్ పూర్తవుతుంది.

అంటే డిసెంబర్ చివరి వరకూ షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది అనుకోవచ్చు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అవీ చూసుకుని నింపాదిగా రిలీజ్ డేట్ పెట్టుకుంటే 2024 మార్చి లేదా ఏప్రిల్ వరకూ మూవీ విడుదల చేసుకోవచ్చు. మొత్తంగా ఓజిగా పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్యాక్డ్ విశ్వరూపం చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అన్నట్టు ఈ అక్టోబర్ లో ఆంధ్రప్రదేశ్ లో కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఏదైనా అతి ముఖ్యమైన సంఘటన జరిగితే తప్ప పొలిటికల్ టూర్ కూడా ఉండదని టాక్.

Related Posts