వకీల్ సాబ్ తో నితిన్ సినిమా

నితిన్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. ఈ రెండూ ఇప్పుడు సెట్స్ పైనే ఉన్నాయి. ఒకటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా విఎన్ఆర్ ట్రియోగా చెబుతోన్న సినిమా. అంటే వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన్నా అని అర్థం. ఈ ముగ్గురూ కలిసి చేసిన భీష్మ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.

ఆ తర్వాతే నితిన్ ట్రాక్ తప్పాడు. కంటిన్యూస్ గా ఫ్లాపులు పడ్డాయి. చివరగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రం ప్రారంభించాడు. దీంతో పాటు వక్కంతం వంశీ డైరెక్షన్ లో మరో సినిమా స్టార్ట్ అయింది. ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందబోతోంది.


ఇక లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. అది కూడా వకీల్ సాబ్ దర్శకుడుతో. తెలుగులో సెన్సిబుల్ మూవీస్ తీసే దర్శకుల లిస్ట్ లో వేణు శ్రీరామ్ ఉంటాడు. ఫస్ట్ మూవీ ఓ మై ఫ్రెండ్ తో ఆకట్టుకున్నా అది పెద్ద హిట్ కాదు. తర్వాత నాని, సాయి పల్లవి జంటగా భూమిక, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో తీసిన ఎమ్.సి.ఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) తో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ రెండు సినిమాలూ దిల్ రాజే నిర్మించడం విశేషం. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్‌ హీరోగా చేసిన వకీల్ సాబ్ కూడా కమర్షియల్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ పింక్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ తర్వాత మళ్లీ అతనికి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో మంచి కథ రాసుకుని నితిన్ ను ఒప్పించాడు. కథ నచ్చడంతో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


ఇక ఈ సినిమా అక్కా తమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. ప్రస్తుతం చేస్తోన్న రెండు సినిమాల్లో ఒక్కటైనా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది.

Related Posts