డ్యాన్సుల్లో దుమ్మురేపుతోన్న నితిన్, శ్రీలీల

ప్రెజెంట్ టాలీవుడ్ లో ఉన్న డ్యాన్సింగ్ స్టార్స్ లో నితిన్ ఒకడు. ఇక.. ఈ జెనరేషన్ హీరోయిన్స్ లో డ్యాన్సులంటే ముందుగా గుర్తుచ్చే పేరు శ్రీలీల. అలాంటి ఈ ఇద్దరు డ్యాన్సింగ్ సెన్సేషన్స్ కలిసి స్టెప్పులేస్తే.. అది ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుంది. లేటెస్ట్ గా ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‘ నుంచి ‘ఒలే ఒలే పాపాయి పలాసకే వచ్చేయి‘ అంటూ సాగే సాంగ్ ప్రోమో రిలీజయ్యింది. నితిన్, శ్రీలీల హై ఎనర్జిటిక్ స్టెప్పులతో మాసీగా సాగిన ఈ డ్యాన్స్ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జైరాజ్ సంగీతంలో కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతాన్ని రామ్ మిరియాల, ప్రియా హేమేష్ ఎనర్జిటిక్ గా ఈ గీతాన్ని ఆలపించారు. ఈ ఫుల్ సాంగ్ ఈనెల 4న రాబోతుంది. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 8న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts