టాలీవుడ్

భోళా శంకర్ కు కొత్త కష్టాలు

నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ కు మధ్య సరైన సంబంధాలున్నప్పుడే ఇండస్ట్రీ హ్యాపీగా ఉంటుంది. ఇందులో స్వార్థం కనిపిస్తే ఖచ్చితంగా నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లే. సినిమాను కొని, అవి ఫ్లాప్ అయినా ఆ నష్టాలను భరిస్తూ.. మరో సినిమా వస్తుంది అనే నమ్మకంతోనే వాళ్లు ఈ వ్యాపారంలో ఉంటారు. అంటే తను ఒక నిర్మాత వద్ద తీసుకున్న సినిమా డిజాస్టర్ అయితే అతను నష్టపోతాడు. దీంతో అదే నిర్మాత నుంచి మరో సినిమాను ఆశించడం న్యాయం. మామూలుగా పరిశ్రమలో ఎప్పటి నుంచో జరుగుతున్నది కూడా ఇదే. అయితే కొన్నాళ్లుగా ఈ వ్యవహారంలో నిర్మాతలు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. తమ సినిమాలతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ను పట్టించుకోవడం లేదు. వాళ్లు నిలువునా మునిగిపోతున్నా తమ స్వార్థాన్నే చూసుకుంటున్నారు. అలా చేయడం వల్లే ఇప్పుడు భోళా శంకర్ నిర్మాతకు కోర్ట్ లో చుక్కెదురు కాబోతోంది.


వైజాగ్ ఏరియాలో మేజర్ డిస్ట్రిబ్యూటర్ అనగానే గాయత్రి ఫిల్మ్స్ కు చెందిన వానపాము సతీష్ గుర్తొస్తాడు. ఆయన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తాజాగా కోర్ట్ లో కేస్ వేశాడు. ఈ కేస్ పూర్తిగా సతీష్‌ కు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. మరి ఈ గొడవ కోర్ట్ వరకూ ఎందుకు వెళ్లిందీ అంటే.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర అనిల్ నిర్మించిన యాక్షన్ 3డి, రన్, జేమ్స్ బాండ్, మహా సముద్రం వంటి సినిమాలన్నిటీని ఉత్తరాంధ్రలో రిలీజ్ చేసింది సతీష్‌. ఈ అన్ని సినిమాలూ డిజాస్టర్స్ అన్న విషయం అందరికీ తెలుసు. అంటే సతీష్ ఎంతో నష్టపోయి ఉంటాడు. వీటిని మించేలా రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. ఆ విషయం పై మాట్లాడేందుకు నిర్మాత అనిల్ సుంకరను కలిసేందుకు ప్రయత్నించినా ఎప్పుడూ కలవలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు.


ఇక ఇప్పుడు అతను భోళా శంకర్ సినిమాతో వస్తున్నాడు. తన వల్ల ఎంతో నష్టపోయిన సతీష్‌ ను కాదని.. మరో డిస్ట్రిబ్యూటర్ కు ఫ్యాన్స్ రేట్ కు ఈ మూవీ ఇచ్చాడు. ఈ విషయం గురించి మాట్లాడాలని ప్రయత్నించినా అనిల్ సుంకర నుంచి కనీసం రెస్పాన్స్ లేకుండా పోయింది. ఇలా వ్యవహరించడం సరైన పరిణామం కాదు. లాభాలొచ్చినపుడు కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చి నష్టపోయిన పాత డిస్ట్రిబ్యూటర్స్ ని పక్కన పెట్టే నిర్మాతల ఆలోచన మంచి పద్ధతి, సరైన ధోరణి కాదు. అందుకే ఈ విషయంపై తనకు తగిన న్యాయం జరగాలని తోటి డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు ఎగ్జిబిటర్స్ కు తన ఆవేదనను వ్యక్తం చేశాడు సతీష్. దీనిపై వారంతా సమిష్టిగా ఓ మంచి నిర్ణయం తీసుకుంటే భోళా శంకర్ కు ఉత్తరాంధ్ర రిలీజ్ పెద్ద సమస్య అవుతుంది. ఏదేమైనా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను గౌరవించని నిర్మాతలపై సరైన చర్చలు తీసుకునేలా చాంబర్ లో కూడా ఓ నిర్ణయం చేస్తే మంచిదేమో.

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

8 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

8 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

8 hours ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

8 hours ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

14 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

14 hours ago