భోళా శంకర్ కు కొత్త కష్టాలు

నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ కు మధ్య సరైన సంబంధాలున్నప్పుడే ఇండస్ట్రీ హ్యాపీగా ఉంటుంది. ఇందులో స్వార్థం కనిపిస్తే ఖచ్చితంగా నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లే. సినిమాను కొని, అవి ఫ్లాప్ అయినా ఆ నష్టాలను భరిస్తూ.. మరో సినిమా వస్తుంది అనే నమ్మకంతోనే వాళ్లు ఈ వ్యాపారంలో ఉంటారు. అంటే తను ఒక నిర్మాత వద్ద తీసుకున్న సినిమా డిజాస్టర్ అయితే అతను నష్టపోతాడు. దీంతో అదే నిర్మాత నుంచి మరో సినిమాను ఆశించడం న్యాయం. మామూలుగా పరిశ్రమలో ఎప్పటి నుంచో జరుగుతున్నది కూడా ఇదే. అయితే కొన్నాళ్లుగా ఈ వ్యవహారంలో నిర్మాతలు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. తమ సినిమాలతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ను పట్టించుకోవడం లేదు. వాళ్లు నిలువునా మునిగిపోతున్నా తమ స్వార్థాన్నే చూసుకుంటున్నారు. అలా చేయడం వల్లే ఇప్పుడు భోళా శంకర్ నిర్మాతకు కోర్ట్ లో చుక్కెదురు కాబోతోంది.


వైజాగ్ ఏరియాలో మేజర్ డిస్ట్రిబ్యూటర్ అనగానే గాయత్రి ఫిల్మ్స్ కు చెందిన వానపాము సతీష్ గుర్తొస్తాడు. ఆయన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తాజాగా కోర్ట్ లో కేస్ వేశాడు. ఈ కేస్ పూర్తిగా సతీష్‌ కు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. మరి ఈ గొడవ కోర్ట్ వరకూ ఎందుకు వెళ్లిందీ అంటే.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర అనిల్ నిర్మించిన యాక్షన్ 3డి, రన్, జేమ్స్ బాండ్, మహా సముద్రం వంటి సినిమాలన్నిటీని ఉత్తరాంధ్రలో రిలీజ్ చేసింది సతీష్‌. ఈ అన్ని సినిమాలూ డిజాస్టర్స్ అన్న విషయం అందరికీ తెలుసు. అంటే సతీష్ ఎంతో నష్టపోయి ఉంటాడు. వీటిని మించేలా రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. ఆ విషయం పై మాట్లాడేందుకు నిర్మాత అనిల్ సుంకరను కలిసేందుకు ప్రయత్నించినా ఎప్పుడూ కలవలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు.


ఇక ఇప్పుడు అతను భోళా శంకర్ సినిమాతో వస్తున్నాడు. తన వల్ల ఎంతో నష్టపోయిన సతీష్‌ ను కాదని.. మరో డిస్ట్రిబ్యూటర్ కు ఫ్యాన్స్ రేట్ కు ఈ మూవీ ఇచ్చాడు. ఈ విషయం గురించి మాట్లాడ�