టాలీవుడ్

అసలు సిసలు లేడీ సూపర్ స్టార్

నయనతార.. సౌతిండియాలో ఈ పేరొక సెన్సేషన్. హీరో డామినేటెడ్ గా చెప్పుకునే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో సూపర్ హిట్స్ అందుకున్న అసలుసిసలు లేడీ సూపర్ స్టార్. తనతో వచ్చిన కథానాయికలు చాలామంది దుకాణం సర్దేసినా.. ఇప్పటికీ హీరోయిన్ గా అదే స్పీడుతో దూసుకెళ్తుంది నయనతార. ఈరోజు నయనతార పుట్టినరోజు (నవంబర్ 18).

nayanatara-birthday-spl-story

నయనతారగా మారిన డయానా మరియం కురియన్
నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్. కేరళలో ఇలాంటి పేర్లు మామూలే. అయితే.. డయానా అనే పేరుతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే కాస్త ఇబ్బంది వచ్చిపడిందట నయన్ కి. ఆ పేరుతో జనం ముందుకొస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆమె ఫస్ట్ మూవీ ‘మనసినక్కరే’ డైరెక్టర్ సత్యన్ అంతిక్కడ్ కి డౌట్ వచ్చిందట. అందుకే.. డయానాని కాస్తా నయనతారగా మార్చేశారు. తొలుత మాతృభాష మలయాళంలో నటించిన నయనతార.. హరి దర్శకత్వంలో రూపొందిన ‘అయ్యా’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక.. అటు తమిళం.. ఇటు తెలుగులోనూ నయనతారకు ఒకేసారి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ‘చంద్రముఖి’. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కి జోడీగా నటించి.. ఓవర్ నైట్ స్టార్ గా మారింది నయనతార. ‘చంద్రముఖి’ సినిమాలో సంప్రదాయ బద్దంగా అలరించిన నయన.. ఆ తర్వాత ‘గజిని’తో గ్లామరస్ ట్రీట్ ఇచ్చింది.

తెలుగులో నయనతార తొలి చిత్రం
‘చంద్రముఖి’, ‘గజిని’ వంటి అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నయన్.. టాలీవుడ్ లో నటించిన తొలి స్ట్రెయిట్ మూవీ ‘లక్ష్మీ’. వెంకటేష్ కథానాయకుడిగా వి.వి.వినాయక్ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని నందిని పాత్రలో నయనతార నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ మూవీలో లక్ష్మీ బావ సాంగ్ అయితే.. సెన్సేషనే సృష్టించింది. కథానాయికగా పరిచయమైన ఐదారేళ్లకే దక్షిణాదిన అగ్రపథంలోకి దూసుకెళ్లింది నయనతార. తెలుగు, తమిళం రెండు భాషలలోనూ రెండు తరాల అగ్ర కథానాయకులతో సినిమాలు చేసిన నాయికగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. తెలుగులో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి వంటి సీనియర్ హీరోస్ తో పాటు.. ప్రభాస్, ఎన్టీఆర్ వంటి ఈ తరం స్టార్స్ తో ఆన్ స్క్రీన్ పై అదరగొట్టింది నయనతార.

అసలు సిసలు లేడీ సూపర్ స్టార్
నయనతార ఇప్పుడు నిస్సందేహంగా సౌత్ లేడీ సూపర్ స్టార్. నిజానికి ఒక స్టార్ హీరో సరసన నటించే అవకాశం వస్తే.. ఆ తర్వాత చిన్న హీరోలతో చేయడానికి హీరోయిన్లు ఇష్టపడరు. తమ క్రేజ్.. మార్కెట్ పడిపోతాయని భయపడిపోతుంటారు. కానీ ఈ ఫార్ములాని బ్రేక్ చేసింది నయనతార. ఒకవైపు స్టార్ హీరోలతో చేస్తూనే.. లేడి ఓరియెంటెడ్ మూవీస్ తో పాటు వర్ధమాన హీరోలతోనూ జోడీ కట్టేందుకు సై అంటోంది. తాను ప్రచారానికి రాను అని ముందే కండిషన్లు పెట్టినా.. ఏరికోరి నయనతార తమ సినిమాలలో కావాలని పట్టుబడుతుంటారు దర్శకనిర్మాతలు. ఇక.. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా సన్నజాజి తీగలా మారుతూ అందంలో తనకు సాటిరారెవరూ అంటూ సాగుతోంది నయనతార.

రిలేషన్ షిప్స్ లోనూ నయనతార రూటే సెపరేటు
సినిమాల విషయంలోనే కాదు.. రిలేషన్ షిప్స్ లోనూ నయనతార రూటే సెపరేటు. ఉత్తరాది హీరోయిన్స్ తో పోల్చుకుంటే.. దక్షిణాది భామలు రిలేషన్ షిప్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఎవరితోనైనా ప్రేమలో ఉన్నా.. అలాంటివి సైలెంటుగా పెళ్లికి దారితీసిన సంఘటనలే ఎక్కువ. ముందుగా శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన.. విఘ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహమాడింది. ఈ జంటకు కవల పిల్లలు జన్మించారు.

బాలీవుడ్ లోకి బడా ఎంట్రీ
మొన్నటివరకూ సౌత్ కే పరిమితమైన నయనతార.. ఇప్పుడు బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తో నయనతార నటించిన ‘జవాన్’ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం వరుసగా తమిళ సినిమాలతో బిజీగా ఉంది నయనతార. మొత్తంమీద.. ఇరవై ఏళ్లుగా కథానాయికగా కొనసాగుతోన్న నయనతార స్పీడు.. మునుముందు మరింత పెరగాలని ఆశిద్దాం.

Telugu 70mm

Recent Posts

వాస్తవ సంఘటనల ఆధారంగా వరుణ్ సందేశ్ ‘నింద’

యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద'. కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా…

14 hours ago

‘లవ్‌ మీ’ ట్రైలర్.. దిల్‌రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న దెయ్యం కథ

ఇప్పటివరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో అలరించిన నిర్మాత దిల్‌రాజు.. ఈసారి ఓ దెయ్యం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.…

14 hours ago

సరిగమ సంస్థకు ‘కల్కి’ ఆడియో రైట్స్

స్టార్ హీరోలు నటించే సినిమాల ఆడియో రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వారు నటించే సినిమాల ఆడియో రైట్స్…

15 hours ago

Raj Tarun is coming as ‘Purushothamudu

Young hero Raj Tarun's latest movie is 'Purushothamudu'. Dr. Ramesh Tejawat and Prakash Tejawat are…

15 hours ago

మత్స్యకన్య గా మారిన అవికా గోర్

చిన్నారి పెళ్లికూతురుగా బుల్లితెరపై పరిచయమై.. 'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్ గా సెటిలైన బ్యూటీ అవికా గోర్. మొదట్లో 'సినిమా చూపిస్తా…

15 hours ago

దర్శకుల సంఘం వేడుకకు రంగం సిద్ధం

కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ వేడుకలేవీ జరగలేదు. తారలంతా ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే…

16 hours ago