డిసెంబర్ నుంచి తప్పుకుంటున్న నాని

నేచులర్ స్టార్ నాని దూకుడు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రిజల్ట్స్ తో పనిలేకుండా రవితేజలా రెగ్యులర్ గా మూవీస్ చేస్తూనే ఉంటాడు. కాకపోతే ఎంచుకునే కథల్లో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండేలా చూసుకుంటాడు. కొన్నాళ్లుగా తన నేచురల్ స్టార్ అనే ఇమేజ్ నుంచి కూడా బయటపడే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో వచ్చినవే శ్యామ్ సింగరాయ్, దసరా మూవీస్. ఈ రెండు సినిమాలతో తనలోని మాస్ యాంగిల్ ను ఆడియన్స్ కు చూపించి అప్రిసియేషన్స్ కూడా అందుకున్నాడు. రాబోయే రోజుల్లో అతన్నుంచి మరిన్ని మాస్ మూవీస్ వస్తాయని ఈ చిత్రాలే చెబుతున్నాయి. ప్రస్తుతం నాని కెరీర్లో 30వ సినిమా చేస్తున్నాడు. 30వ సినిమా అంటే ఎవరికైనా ఓ మైల్ స్టోన్ లాంటిదే కదా..? అందుకే సేఫ్ గా తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఉండే కథతోనే ఈ చిత్రం చేస్తున్నాడు.


నాని30 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీలో అతని సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జెర్సీ తర్వాత మరోసారి ఫాదర్ సెంటిమెంట్ తో ఈ చిత్రం ఉండబోతోందని ఫస్ట్ లుక్ టైమ్ లో విడుదల చేసిన వీడియో చూస్తే అర్థమైంది.

శౌర్యు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న విడుదల చేస్తామని ముందే ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ లోనే పూర్తవుతుందట. అందుకే ప్రీ పోన్ చేయబోతున్నారు అని చెబుతున్నారు. అయితే షూటింగ్ ముందే పూర్తవుతుంది కాబట్టి ముందు వస్తున్నారు అని కాదు. డిసెంబర్ 21న భారీ పోటీ ఉంది.


నాని చెప్పిన టైమ్ కే వెంకటేష్‌ కూడా తన కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి 75వ సినిమా సైంధవ్ తో వస్తున్నాడు. హిట్ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్‌ కొలను డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. ఈ చిత్రంపై ఇప్పటికే ఎక్స్ పెక్టేషన్స్ పెంచి ఉన్నారు.

అయితే నానికి వెంకటేష్ తో పెద్దగా ఇబ్బంది లేదు. బట్ డిసెంబర్ 22న పవన్ కళ్యాణ్‌, సుజీత్ కాంబోలో వస్తోన్న ”ఓ.జి” మూవీని విడుదల చేయాలని దాదాపు ఫిక్స్ అయ్యారు.”ఓ.జి” సగం షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచి ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్‌ మూవీతో కూడా పెట్టుకుంటే నాని సినిమా నలిగిపోతుంది. అందుకే ప్రీ పోన్ చేసుకుని ముందే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.


ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి నాని30ని నవంబర్ లో విడుదల చేయొచ్చు అంటున్నారు. అదీ మంచిదే. వీళ్ల కంటెంట్ బావుండి.. మంచి ప్రమోషన్స్ చేసుకుంటే నాని సినిమాకు ఎప్పుడు వచ్చినా ఇబ్బంది ఉండడు.

Related Posts