ఎన్టీఆర్ అభిమాని మృతిపై అనుమానాలు

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ అనే కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపణలు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన శ్యామ్ చాలాకాలంగా ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఆయనతో కలిసి ఫోటోస్ కూడా దిగాడు. ఓ సినిమా ఫంక్షన్ లో వేదికపైకి వెళ్లి ఆయన్ని కలిశాడు కూడా. శ్యామ్ మరణం తర్వాత ఇవన్నీ వైరల్ అవుతున్నాయిప్పుడు. అంతేకాక ఈ అనుమానాస్పద మరణంపై పోలీస్ లు విచారణ చేసి దోషులను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ‘జస్టిస్ ఫర్ శ్యామ్” అనే హ్యాష్‌ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అలాగే శ్యామ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అని మిత్రులతో పాటు ఎన్టీఆర్ అభిమాన సంఘాలు కూడా చెబుతున్నాయి.


అభిమానుల మధ్య వాదనలు జరగడం ఎప్పుడూ చూస్తుంటాం. కానీ ఇలాంటి విషయాలను మాత్రం ఎవరైనా సరే ఖండించాల్సిందే. అలాగే ఈ తరహా వ్యవహారాల్లో పొలిటికల్ జోక్యాలను కూడా ఖండించాలి. కానీ ఇప్పటికే శ్యామ్ ఆత్మహత్య .. రాజకీయ రంగులు పులుముకుంటోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా శ్యామ్ మరణంపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచే ఇలాంటి డిమాండ్స్ ఎక్కువగా వస్తుండటంతో అటు వైసీపీ వాళ్లు కూడా కౌంటర్స్ మొదలుపెడతున్నారు.


అయితే పార్టీల మధ్య తగువులాటను పక్కన బెట్టి శ్యామ్ మరణంపై సత్వరమే విచారణ జరిపించాలి. హత్య అని తేలితే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఒకవేళ ఆత్మహత్యే అయితే ఆ విషయాన్ని ప్రాపర్ ఎవిడెన్స్ లతో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అవి తీవ్ర రూపం దాల్చకముందే అధికారులు, పోలీస్ లు సరైన చర్యలు తీసుకుంటే మరిన్ని ఇబ్బందులు రాకుండా అరికట్టొచ్చు అనేది కామన్ పీపుల్ అభిప్రాయం.

Related Posts