రజనీకాంత్-లోకేష్ కనకరాజ్ మూవీలో నాగార్జున?

కథ నచ్చితే చాలు కాంబినేషన్స్ గురించి అస్సలు పట్టించుకోడు కింగ్ నాగార్జున. ఈకోవలోనే మల్టీస్టారర్స్ చేయడానికి కూడా ముందుంటాడు. ఇప్పటికే తమిళ నటుడు కార్తీతో కలిసి ‘ఊపిరి’లో నటించిన నాగ్.. ప్రస్తుతం ‘కుబేర’లో ధనుష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. లేటెస్ట్ గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

రజనీకాంత్ తో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించే సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించబోతున్నట్టు కోలీవుడ్ టాక్. ఈరోజు (ఏప్రిల్ 22) రజనీకాంత్-లోకేష్ కనకరాజ్ సినిమాకి సంబంధించి టైటిల్ రివీల్ టీజర్ రాబోతుంది. ఈ మూవీలో నాగార్జునతో పాటు చాలామంది పాపులర్ స్టార్స్ కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ నుంచి షారుక్, రణ్ వీర్ సింగ్ ఈ సినిమాలో అతిథులుగా మెరవనున్నారట. ఇక.. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో రజనీకాంత్ కి కూతురు పాత్రలో కనిపిస్తుందనే టాక్ కూడా కోలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.

Related Posts