మైత్రీ మూవీ మేకర్స్ మలయాళం మూవీ ‘నడిగర్‘ టీజర్

తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకెళ్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. తమిళం, మలయాళం భాషల్లోనూ దూకుడు పెంచబోతున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే మలయాళంలో స్టార్ హీరో టోవినో థామస్ తో ‘నడిగర్‘ చిత్రాన్ని నిర్మిస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఒక సూపర్ స్టార్ జీవితంలోని గుడ్, బ్యాడ్, అగ్లీ ఫేజెస్ ను చూపిస్తూ లాల్ జూనియర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో షౌబిన్ షాయిర్, వీణా నందకుమార్, ధ్యాన్ శ్రీనివాసన్, శ్రీనాథ్ భాసి, అనూప్ మీనన్, షైన్ టామ్ చాకో, లాల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మే 3న ‘నడిగర్‘ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts