ఆకట్టుకుంటోన్న నిహారిక సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో

మెగా డాటర్ నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై ఇప్పటికే వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇప్పుడు ఓ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తుంది. పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను పరిచయం కాబోతున్న ఈ మూవీకి యదు వంశీ దర్శకుడు.

యుూత్ ఫుల్ కాన్సెప్ట్ తో రూపొందబోతున్న ఈ మూవీ టైటిల్ ను ఉగాది కానుకగా ప్రకటించబోతున్నారు. సుప్రీమ్ హీరో సాయిదుర్గాతేజ్ చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ జరగబోతుంది. ఇక.. టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంటుంది.

Related Posts