టాలీవుడ్

నా సినిమా ఒక డాన్ నే మార్చింది – సముద్రఖని

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్ర దర్శకుడు సముద్రఖని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ కథ తెలుగులో పవన్ కళ్యాణ్ వరకూ ఎలా వెళ్లింది అనే అంశాన్ని పంచుకున్నాడు. ఎక్కడో తమిళనాడులో వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన తను ఈ సినిమా చేయడానికి కారణం “టైమ్” అన్నాడు. ఆ టైమే తనను ఇక్కడి వరకూ తెచ్చిందని చెప్పాడు. ఈ సందర్భంగా ఈ కథ పవన్ కళ్యాణ్ వరకూ వెళ్లిన విధం గురించి చెప్పాడు.


“ఓ రోజు నేను త్రివిక్రమ్ గారితో ఉన్నాను. నాకు ఓ ఫోన్ వచ్చింది. మధురై నుంచి ఓ పెద్ద డాన్ మాట్లాడాడు. నా సినిమా చూసి తను మారిపోయాను అని చెప్పాడు. అతనెవరు అని త్రివిక్రమ్ గారు అడిగితే నేను విషయంచెప్పాను. త్రివిక్రమ్ గారు ఆ సినిమా కథ గురించి అడిగారు. అప్పుడు నేను చెప్పాను. ఇది టైమ్ వాల్యూ గురించిన కథ అని. అదేంటీ అంటే.. ఒక మనిషి చనిపోతే స్వర్గానికి వెళతాడు అక్కడ కులం,మతం, జాతి, భేదం ఏమీ ఉండవు.. మరి నరకంలో అంటే అక్కడి నుంచే కదా తీసుకువెళుతున్నాను అన్నాను.

వెంటనే త్రివిక్రమ్ గారు ఓ పది నిమిషాలు టైమ్ తీసుకుని ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. అలా మొదలైంది ఈ కథ.త్రివిక్రమ్ గారు ఈ కథను అద్భుతంగా డెవలప్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ కథలా ఉంటుంది. ఈ కథలో నా తమ్ముడు సాయితేజ్ ఓ పెద్ద బలం. నా ఆర్టిస్టులు అందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ టైమ్ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్స్ తో పనిచేశాను.

నా ఫస్ట్ ఫిల్మ్ కు తమన్ సంగీత దర్శకుడు. 23యేళ్ల తర్వాత మళ్లీ తమన్ తో కలిసి పనిచేస్తున్నాను. ఇది నా 50వ సినిమా. 23నిమిషాల టైమ్ రీ రికార్డింగ్ చూశాను. తమన్ ఏమైందన్నా అన్నాడు. ఏమో మ్యాజిక్ జరుగుతుందని చెప్పాను. ఈ సందర్భంగా నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను.

నిర్మాతలు వివేక్, విశ్వ ప్రసాద్ గారికి థ్యాంక్యూ.17యేళ్ల క్రితం ఓ నాటకంలో చూసిన పాయింట్ ఈ కథ.మా గురువు కే బాలచందర్ సార్ నన్ను ఈ కథ చేయమన్నారు. ఆ నాకటం రైట్స్ కూడా ఇప్పించారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను తెలుగు రాష్ట్రాలకు వచ్చిన పని ఐపోయింది అనిపిస్తోంది. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ కథ చెప్పబోతున్నాను. త్రివిక్రమ్ గారునాకు ఓ తండ్రిలా గైడ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్యూ.. ” అన్నారు.

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

6 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

6 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

7 hours ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

7 hours ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

12 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

13 hours ago