HomeMoviesటాలీవుడ్మురుగదాస్, శివకార్తికేయన్‌ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్‌

మురుగదాస్, శివకార్తికేయన్‌ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్‌

-

వరుస బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌తో ఈ జనరేషన్‌లో స్టార్‌ గా ఎదిగిన హీరో శివకార్తికేయన్. క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌ డైరెక్షన్‌లో మూవీ చేయబోతున్నాడు. ఈసినిమా శివకార్తికేయన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాండియర్‌ చిత్రం గా నిలవబోతుందట. ఈ సినిమా శివకార్తికేయన్ ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా కొత్తగా కనిపిస్తాడట. ఏఆర్ మురుగదాస్ స్టోరీ టెల్లింగ్ స్టైల్‌ మిగతా డైరెక్టర్‌లతో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుంది. వీరిద్దరి కాంబో కావడంతో అంచనాలు భారీ గా ఉన్నాయి. శరవేగంగా తొలిషెడ్యూల్ షూట్ కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ రెగ్యులర్‌ షూట్ స్టార్ట్‌ చేసింది చిత్ర యూనిట్. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

ఇవీ చదవండి

English News