సలార్ స్థానంలో సినిమాలే సినిమాలు

ఒక్క సినిమా వాయిదా పడితే ఆ ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందనేదాన్ని బట్టి ఆ హీరో రేంజ్ ను కూడా ఊహించుకోవచ్చు. ఇంకా అఫీషియల్ గాఅనౌన్స్ మెంట్ రాకున్నా సలార్ వాయిదా పడిందనేది తేలిపోయింది. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది పక్కన బెడితే ఆ డేట్ లో కొత్త సినిమాల ప్రకటనలు మాత్రం ఆశ్చర్యపరుస్తున్నాయి.

సలార్ వాయిదా అని తెలిసిన మరుక్షణమే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. ఈ బ్యానర్ నుంచి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అయింది. ఆ నిర్మాణ సంస్థ రూపొందించిన ‘మ్యాడ్’ సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తున్నాం ఫస్ట్ అనౌన్స్ చేశారు. ఇక సలార్ వాయిదా అనేది ఖచ్చితం తెలిసిన తర్వాత కిరణ్ అబ్బవరం కూడా లైన్ లోకి వచ్చాడు.


కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ సినిమాను 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రత్తినం కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సమ్మోహనుడా అనే పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సంపాదించుకుంది. నిజానికి ఈ మూవీ రిలీజ్ డేట్ విషయలోమేకర్స్ కు ఇప్పటివరకూ ఓ క్లారిటీ లేదు. కాకపోతే సినిమా రెడీగా ఉంది. అందుకే సలార్ వాయిదా అన్నది ఖచ్చితంగా తేల్చుకుని మేమూ 28నే వస్తున్నాం అని ప్రకటించారు.


వీరితో పాటు సడెన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమా ‘పెదకాపు1’. శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తోన్న సినిమా. శ్రీకాంత్ సినిమా అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే అందరికీ తెలుసు. బట్ టీజర్ తో తను పూర్తిగా కొత్త జానర్ తో వస్తున్నా అని చెప్పడానికి. ఇప్పటివరకూ అతను తీసిన సినిమాలకు భిన్నంగా అవుట్ అండ్ అవుట్ మాస్ కంటెంట్ తో వస్తున్నట్టు అర్థమైంది. అలాగే ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీ వాత్సవ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ పెదకాపు1ను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.


అయితే సలార్ వాయిదా వల్ల మంచి రిలీజ్ డేట్ దొరికింది అన్న వీరి ఆనందానికి బ్రేకులు వేసేలా కనిపిస్తున్నాడు దిల్ రాజు. ఆయన విడుదల చేయబోతోన్న స్కంద చిత్రాన్ని సెప్టెంబర్ 28కి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు. నిజానికి ఈ మూవీని ఈనెల 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

బట్ ఆ డేట్ లో ఆల్రెడీ చంద్రముఖి2, మార్క్ ఆంటోనీ అంటూ డబ్బింగ్ సినిమాలున్నాయి. వీటిలో చంద్రముఖి2ను విడుదల చేస్తుంది దిల్ రాజే. సో.. ఈ రెండు సినిమాలను రెండు వేర్వేరు డేట్స్ లో వేస్తే అది తనకే లాభం అనే ఆలోచనలోఉన్నాడు దిల్ రాజు. మరి ఒక్క సినిమా వాయిదా పడితే ఎన్ని సినిమాలు పండగ చేసుకుంటున్నాయో చూస్తున్నాం కదా.. దీన్ని బట్టి ప్రభాస్ అనే డైనోసార్ ఎంత భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.

Related Posts