సమంత ఏదీ అని విజయ్ అడిగిన నాగార్జున

బిగ్ బాస్ 7 సీజన్ ప్రారంభమైంది. మరోసారి అక్కినేని నాగార్జుననే ఈ బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే కంటెస్టెంట్స్ అంతా హౌస్ లోకి వెళ్లిపోయారు. వారికి ఇవ్వాల్సిన ట్రెయినింగ్, సలహాలు, సూచనలూ అన్నీ అయిపోయాయి. ఇక షో మొదలు కాగానే ఆటోమేటిక్ గా రచ్చ కూడా స్టార్ట్ అవుతుంది.

అయితే ఈ షో ఓపెనింగ్ కోసం విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి గెస్ట్ లు గానూ.. తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నట్టుగానూ వచ్చారు.

ఇద్దరూ క్రేజీ హీరోలే. అందుకే అటు కంటెస్టెంట్స్ కూడా కొత్త ఊపు వస్తుంది. ఇక ఈ షో ప్రోమోలో విజయ్ దేవరకొండ రాగానే నాగార్జున అడిగిన ప్రశ్నకు విజయ్ కూడా షాక్ అయ్యాడు.


విజయ్ రావడంతోనే ఆరాధ్య పాటకు కొంత పర్ఫార్మ్ చేశాడు. తర్వాత నాగ్ వచ్చి.. ” ఏదీ మీ హీరోయిన్ ఎక్కడ.. సమంత ఎక్కడా.. ” అని అడిగాడు. ఇది ప్రోమో. నిజంగా నాగార్జున జెంటిల్మన్ అనేందుకు ఇదే ఉదాహరణ. అస్సలే మాత్రం హిపోక్రసీ లేకుండా లైఫ్ లో కొన్ని జరుగుతాయి. వాటిని లైట్ తీసుకుని ముందుకు వెళ్లాలి తప్ప.. ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం పెంచుకోకూడదు అనేలా ఉంది నాగ్ బిహేవియర్. మరి దానికి విజయ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటీ అనేది మరికొద్ది సేపట్లోనే తెలిసిపోతుంది.

Related Posts