బింబిసార2కు బంపర్ ఆఫర్..

బింబిసార.. కళ్యాణ్‌ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. 2022 ఆగస్ట్ 5న విడుదలైన ఈ సినిమా యూనానిమస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. డెబ్యూ డైరెక్టర్ వశిష్ట రూపొందించిన ఈ సోసియో ఫాంటసీ డ్రామాలో కళ్యాణ్‌ రామ్ నటనకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి.

కరడుగట్టిన బింబిసారుడు అనే రాజు.. అనుకోకుండా ఈ కాలానికి రావడం.. ఇక్కడ తనలోని క్రూరత్వం నశించి మనిషిలా మారడం.. తర్వాత మళ్లీ తన రాజ్యానికి వెళ్లి గొప్ప పాలన అందించే ప్రయత్నం చేయాలనుకుంటాడు. కానీ అప్పటికే అతనిలానే ఉండే అతని సోదరుడు ఆ పని చేస్తాడు. అలాంటి తమ్ముడిని అంతం చేయాలనుకున్న వారిని తను తిరిగి అంతం చేస్తాడు. ఈ కథలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నా.. కళ్యాణ్‌ రామ్ ఒన్ మేన్ షోలా అన్ని మైనస్ లను మరిపించాడు. ఇక అప్పుడే ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తాం అని చెప్పారు. చెప్పినట్టుగానే ఈ సీక్వెల్ కు సంబంధించి వర్క్ మొదలైంది.


బింబిసార బ్లాక్ బస్టర్ కావడంతో సీక్వెల్ ను ఏకంగా 100 కోట్లకు కొంటాం అని ముందుకు వచ్చింది జీ5 సంస్థ. కళ్యాణ్‌ రామ్ మార్కెట్ కు 100 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. ఈ అమౌంట్ తో సినిమాను ఎంత పెద్ద కాన్వాస్ లో అయినా చిత్రించొచ్చు. కాకపోతే అందుకు తగ్గ బలమైన కథ కావాలి.

ఇక్కడే వీరికో షాక్ తగిలింది. ఈ సీక్వెల్ నుంచి దర్శకుడు వశిష్ట తప్పుకున్నాడు. అతను ఆల్రెడీ సీక్వెల్ కు కథ కూడా రాసుకున్నాడు. తప్పుకున్నాడు కాబట్టి.. కథ ఇవ్వలేదు. దీంతో అతని ప్లేస్ లో ఆకాశ్ పూరీతో రొమాంటిక్ అనే సినిమా తీసిన దర్శకుడిని తెచ్చారు. అతనిప్పుడు కథను రెడీ చేస్తున్నాడు. అదృష్టం ఏంటంటే.. వశిష్ట తప్పుకున్నా.. జీ 5 తన ఒప్పందానికి కట్టుబడే ఉంది. అంటే వారిని మెప్పించేలా మంచి కథ సెట్ చేసుకుని సెట్స్ పైకి వెళితే.. సినిమా చూసి అగ్రిమెంట్ కు సైన్ చేస్తారు. అదీ మేటర్.

Related Posts