కోలీవుడ్ లో మరో లవ్ మ్యారేజ్

సినిమా పరిశ్రమలో ప్రేమ వివాహాలు సాధారణమైపోయాయి. అలా కోలీవుడ్ లో మరో లవ్ మ్యారేజ్ కు రంగం సిద్ధమైంది. అశోక్ సెల్వన్ అనే నటుడు కీర్తి పాండ్యన్ అనే నటిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అశోక్ సెల్వన్ కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి కూడా పరిచయమే. ఆ మధ్య వచ్చిన విశ్వక్ సేన్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో హీరోయిన్ ను ప్రేమించిన వ్యక్తిగా కేమియో రోల్ లో కనిపించాడు. కానీ ఆ పాత్ర అంతగా రిజిస్టర్ కాలేదు.

అలాగే అదే విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా ఒరిజినల్ తమిళ్ మూవీ ఓ మై కడవులే హీరో కూడా ఈ అశోక్ సెల్వనే. అతను తన సహనటి కీర్తి పాండియన్ ను ప్రేమించాడు. వీరి పెళ్లికి ఇద్దరి ఇళ్ల నుంచి ఆమోదం లభించింది.


ఇక విశేషం ఏంటంటే.. ఈ కీర్తి సురేష్ ఎవరో కాదు.. ఒకప్పుడు యాక్షన్ హీరోగా తెలుగులోనూ తిరుగులేని క్రేజ్ ఉన్న అరుణ్ పాండ్యన్ కూతురు. కొన్నాళ్ల క్రితమే తన కూతురు హీరోయిన్ గా ఓ సినిమా నిర్మించాడు కూడా. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆమె ఇండస్ట్రీలోకి వస్తా అన్నప్పుడు దగ్గరుండి ఎంకరేజ్ చేశాడు. తను మాత్రం ప్రొఫెషన్ కంటే ప్రొఫెషన్ లోని పర్సన్ తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను కూడా అంగీకరించి ఆశీర్వదించబోతున్నాడు అరుణ్‌ పాండ్యన్.

Related Posts