యూవీ క్రియేషన్స్ బ్యానర్ సినిమా అంటే మాగ్జిమం ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వారి ఆసక్తిని కూడా చంపేస్తూ రాధేశ్యామ్ టైమ్ లో వారితో ఓ ఆటాడుకుంది ఆ బ్యానర్. అప్పటి నుంచి వారికి కూడా ఆ బ్యానర్ అంటే నచ్చడం లేదు. ఏదైనా సినిమాలకు సంబంధించి సరైన అప్డేట్ ఇవ్వడంలో కానీ, రిలీజ్ డేట్ విషయంలో పక్కాగా ఉండటం కానీ ఈ బ్యానర్ కొన్నాళ్లుగా చేయడం లేదు అనేది అందరికీ తెలుసు. అదే మరోసారి రిపీట్ అయింది.
మంచి క్రేజీ కాంబినేషన్ అని.. అనౌన్స్ మెంట్ తో ఆకట్టుకుని ఒక్కో అప్డేట్ తో అంచనాలు పెంచిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మంచి బజ్ వచ్చింది. దాన్ని క్యాష్ చేసుకోవడంలో ఈ బ్యానర్ పూర్తిగా విఫలమైంది. సమ్మర్ లో విడుదల చేస్తారు అనే ప్రచారం జరిగింది. నిజానికి సమ్మర్ లో సరైన సినిమాలు పడలేదు. ఆ టైమ్ లో వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ అయి ఇప్పటికే ఓటిటిల్లోకి వచ్చేది.
తర్వాత జూన్, జూలై ఇలా డేట్స్ మారుతూనే వెళ్లాయి. చివరికి ఆగస్ట్ 4న అని అఫీషియల్ గానే అనౌన్స్ చేసినా రిలీజ్ కు పది రోజుల ముందే ప్రేక్షకులకు ఈ సినిమా రాదు అని అర్థమైంది. అందుకే ఎవరూ పట్టించుకోలేదు. వాళ్లు చెప్పినట్టు జరిగి ఉంటే ఈ రోజు సినిమా విడుదలై ఉండేది.
ఆగస్ట్ 4న రావడం లేదు అని చెబుతూ.. మరో కొత్త డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని ఓ ప్రకటన ఇచ్చారు. బట్ నెక్ట్స్ రిలీజ్ డేట్ విషయంలో కూడా అదే కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోందట. ఇప్పటికీ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే అంశాన్ని తేల్చుకోలేకపోతోందీ బ్యానర్. ప్రస్తుతానికైతే ఆగస్ట్ 18న అని వినిస్తోంది.. అదే టైమ్ లో 25న కూడా రావొచ్చు అంటున్నారు. అంటే ఇంకా తేల్చేకలేకపోతున్నారు అనే కదా అర్థం.
ఆగస్ట్ 18న పెదకాపు1, ఆదికేశవ, మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్ అనే సినిమాలు షెడ్యూల్ చేసుకుని ఉన్నాయి. వీటిలో ఆది కేశవ డౌట్ అంటున్నారు. ఇక ఆగస్ట్ 25న గాండీవధాని అర్జున, బెదురులంక2012 సినిమాలు షెడ్యూల్ అయ్యి ఉన్నాయి. మరి ఈ రెండు డేట్స్ నుంచి అయినా ఏదోటి ఫిక్స్ చేసుకుంటారా లేక మరో కొత్త డేట్ అంటారా అనేది చెప్పలేం కానీ.. ఇప్పటికే చాలామందికి ఈ సినిమాపై చాలామందికి ఆసక్తి పోయింది.
The film 'Indian' came out with the story of how an Indian who fought heroically…
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న డివోషనల్ మూవీ 'కన్నప్ప'. అసలు రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడైన…
Today (May 9) the team released special glimpses from the movie 'Tandel' on the occasion…
స్వాతంత్ర్యోద్యమంలో వీరోచితంగా పోరాడిన ఓ భారతీయుడు.. స్వాతంత్ర్యానంతరం జరుగుతోన్న అవినీతిపై ఎలా ఉక్కు పాదం మోపాడన్న కథతో 'ఇండియన్' చిత్రం…
Today (May 9) is rowdy star Vijay Deverakonda's birthday. On this occasion, the makers have…
Natural Beauty Sai Pallavi does movies selectively without accepting all the offers. She suddenly gave…