HomeMoviesటాలీవుడ్డబుల్ డోస్ ఫన్, హారర్ ఎలిమెంట్స్ తో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది‘

డబుల్ డోస్ ఫన్, హారర్ ఎలిమెంట్స్ తో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది‘

-

అంజలి కెరీర్ లో ‘గీతాంజలి‘ చిత్రానిది ప్రత్యేక స్థానం. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందిన ‘గీతాంజలి‘ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ‘గీతాంజలి‘కి సీక్వెల్ గా రాబోతున్న సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది‘. మొదటి భాగానికి మించిన రీతిలో డబుల్ డోస్ ఫన్ తో పాటు.. హారర్ ఎలిమెంట్స్ తో ‘గీతాంజలి 2‘ని తీసుకొస్తున్నాడు రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్.

టైటిల్ రోల్ లో అంజలి కనిపించబోతున్న ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, ఆలీ, రవిశంకర్, షకలక శంకర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకుడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చాడు. ఒక దెయ్యాల ఇంట్లో షూటింగ్ కోసం వచ్చిన కొంతమందికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే థీమ్ తో ఆద్యంతం నవ్వులు పంచుతూ.. అంతే స్థాయిలో భయపెడుతూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 11న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది‘ విడుదలకు ముస్తాబవుతోంది.

ఇవీ చదవండి

English News