మెగాస్టార్ మల్టీస్టారర్ ..

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. అసలు అంచనాలే లేకుండా వచ్చినప్పుడే అందుకు సిద్ధమైపోయారు అంతా. అందుకే ఈ సినిమా పోయిందనే బాధ ఫ్యాన్స్ లోనూ పెద్దగా కనిపించడం లేదు. అటు మెగాస్టార్ మాత్రం తన నమ్మకం నిజం కాలేదని కొంత ఫీలయ్యాడు అంటున్నారు. అయినా ఇలాంటి ఫ్లాపులు, బ్లాక్ బస్టర్స్ ఎన్నో చూసిన ఆయన ఈ సినిమా రిజల్ట్ తో కుంగిపోకుండా నెక్ట్స్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేశాడు. ఈ సారి మల్టీస్టారర్ తో వస్తున్నాడు. యస్.. కొన్నిసార్లు ఫ్లాప్ బాధలు మర్చిపోవాలంటే ఇమ్మీడియొట్ గా నెక్ట్స్ స్టెప్ వేయాలి. ఈ విషయంలో మెగాస్టార్ నుంచి అప్ కమింగ్ హీరోస్ కూడా నేర్చుకోవాలి.


ఇక ఈ మధ్య మెగా హీరోలు చేస్తోన్న రీమేక్ లన్నీ ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో మెగాస్టార్ నెక్ట్స్ మూవీ కూడా రీమేక్ అనే భావన చాలామందిలో ఉంది. అందుకు తగ్గట్టుగా మళయాలంలో బ్లాక్ బస్టర్ అయిన ‘బ్రో డాడీ’ సినిమానే తెలుగులో చేస్తున్నాడు అనే రూమర్స్ కూడా గట్టిగా ఉన్నాయి. కానీ అది నిజం కాదు. ఈ సారి రీమేక్ తో రావడం లేదు. స్ట్రెయిట్ స్టోరీనే. కాకపోతే ఈ చిత్రంలో ఆయన తండ్రిగా కనిపించబోతున్నాడు. ఆయన కొడుకు పాత్రలో శర్వానంద్ నటిస్తున్నాడు. మెగాస్టార్ కు తనయుడుగా శర్వానంద్ అంటే బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.

శర్వానంద్, రామ్ చరణ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి శర్వానంద్ కూడా మెగా ఇంట్లో మసలినవాడు. అందువల్ల వీరి కెమిస్ట్రీ కూడా నేచురల్ గా వర్కవుట్ అవుతుంది. ఈ చిత్రానికి కళ్యాణ్‌ కృష్ణ దర్శకుడు. విశేషం ఏంటంటే.. ఈ మూవీలో వెంకటేష్‌ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడట. యస్.. హీరోయిన్ అన్న పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు అంటున్నారు.ఇప్పటికే వెంకీ కూడా ఓకే చెప్పి ఉన్నాడట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ కూడా స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న అఫీషియల్ అనౌన్స్ అవుతుంది. 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతున్నారట. సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారని టాక్.


మరోవైపు బింబిసార దర్శకుడు వశిష్ట కథను కూడా ఓకే చేసి ఉన్నాడు చిరంజీవి. ఆ మూవీని కూడా ఈ యేడాది నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారంటున్నారు. సో.. భోళా శంకర్ రిజల్ట్ గురించి కాక తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై కాన్ సెంట్రేట్ చేస్తున్నాడనే చెప్పాలి. మరి చిరంజీవి, వెంకటేష్‌, శర్వానంద్ ల కాంబోలో మల్టీస్టారర్ గా రానున్న ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ?

Related Posts