ఓవర్శీస్ ను షేక్ చేస్తోన్న జైలర్

స్టార్ హీరోల సినిమాలకు ఉండే అడ్వాంటేజ్ ఒకటుంది. హిట్ టాక్ వస్తే సూపర్ హిట్ అయిపోతుంది. సూపర్ హిట్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. కలెక్షన్స్ పరంగా కూడా నెక్ట్స్ లెవల్లో కనిపిస్తాయి. ఇప్పుడు జైలర్ విషయంలో అదే జరుగుతోంది. దాదాపు పదేళ్ల తర్వాత రజినీకాంత్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.

నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ప్రాణం పోసింది. అతని నేపథ్య సంగీతమే మెయిన్ హైలెట్ గా నిలిచింది. అందుకే సెకండ్ హాఫ్‌ వీక్ అనే టాక్ ఉన్నా.. దాన్ని దాటుకుని నిలబడిందంటే కారణం ఈ నేపథ్య సంగీతమే అంటే అతిశయోక్తి కాదు. తెలుగులో ఇప్పటికే లాభాల బాటలోకి వచ్చింది. తమిళ్ బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తోన్న జైలర్.. ఆశ్చర్యంగా ఓవర్శీస్ బాక్సాఫీస్ ను కూడా షేక్ చేస్తున్నాడు.

ఎవరూ ఊహించని రేంజ్ లో ఓవర్శీస్ లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. నిజానికి తమిళ్ మూవీస్ తో వేరే దేశాల్లో మార్కెట్ సంపాదించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరో అంటే రజినీకాంత్ నే చెప్పాలి. ఆయన ఒకప్పటి ముత్తు, అన్నామలై, నరసింహా వంటి చిత్రాలు జపాన్, మలేసియా దేశాల్లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అప్పటి నుంచీ ఆయనకు అక్కడ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇక ఈ జైలర్ కు ముందు రజినీ కమర్షియల్ సక్సెస్ ల విషయంలో బాగా వెనక బడి ఉన్నాడు. ఆ లోటును ఒకేసారి తీర్చింది ఈ జైలర్ మూవీ.


యూస్ లో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 3.25 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఇవాళా రేపు ఒన్ మిలియన్ క్లబ్ లో చేరితేనే సంతోషంగా ఫీలవుతున్నారు. లాంగ్ రన్ లో టూ మిలియన్, త్రీ మిలియన్ వరకూ వెళుతున్నాయి మన సినిమాలు. కానీ మూడు రోజుల్లో త్రీ మిలియన్ క్లబ్ అంటే అరాచకం అనే చెప్పాలి. విశేషం ఏంటంటే.. ఈ మూవీని ఓవర్శీస్ లో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో విడుదల చేశారు. దీంతో విదేశాల్లో ఉన్న తమిళులతో పాటు తెలుగు, కన్నడ, మళయాలీ పీపుల్ కూడా తమ తమ భాషల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ కలెక్షన్స్ కు అది కూడా ఓ కారణం అని చెప్పాలి. కేవలం తమిళ్ లో విడుదల చేస్తే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అంటే చెప్పలేం కానీ.. ప్రస్తుతం ఓవర్శీస్ లో జైలర్ హవా నడుస్తోంది. మొత్తంగా ఈ మూవీ కమల్ హాసన్ విక్రమ్ కలెక్షన్స్ ను దాటొచ్చు అనే అంచనాలున్నాయి. దాటినా లేకున్నా.. కొన్నవాళ్లంతా పండగ చేసుకునేంత పెద్ద హిట్ గా మాత్రం నిలుస్తుంది.

Related Posts