‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర కథానాయకులను ఆహ్వానించిన విష్ణు.. ఇప్పుడు కథానాయికలను ప్రవేశపెడుతున్నాడు. లేటెస్ట్ గా ఈ మైథలాజికల్ మూవీలో కాజల్ అగర్వాల్ భాగస్వామ్యం అయ్యింది. ‘కన్నప్ప’లోని ఓ కీలక పాత్రకోసం కాజల్ ను తీసుకున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది.

పెళ్లి, ఆ తర్వాత కుమారుడు పుట్టడం వంటి కారణాలతో సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న కాజల్.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. రీఎంట్రీలో ‘భగవంత్ కేసరి’తో బడా హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ‘సత్యభామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతుంది కాజల్. మరోవైపు.. ‘కన్నప్ప’ టీజర్ ను ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆవిష్కరించబోతున్నారు. మే 20న సాయంత్రం 6 గంటలకు ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విష్ణుతో ‘మోసగాళ్లు’ సినిమాలో నటించింది కాజల్.

Related Posts