శంకర్ కూతురు పెళ్లిలో మెగా సందడి

డైరెక్టర్స్ కు హీరోయిజాన్ని తీసుకొచ్చిన అతికొద్దిమంది దర్శకుల్లో శంకర్ ఒకరు. అలాంటి శంకర్ ఇంటిలో శుభకార్యం అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి తరుణ్ కార్తికేయన్ తో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తమిళ ఇండస్ట్రీ నుంచి దిగ్గజ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ తో పాటు విక్రమ్, సూర్య వంటి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఇక.. టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీ ఈ వేడుకలో సందడి చేసింది. చిరంజీవి-సురేఖ, రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఈ ఫంక్షన్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం శంకర్.. రామ్ చరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకున్న ‘గేమ్ ఛేంజర్’ సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది.

Related Posts