‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ గురించి మెగా కామెంట్స్..?

చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ఒకటి. జగదేకవీరుడు గా చిరంజీవి, అతిలోకసుందరిగా శ్రీదేవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తారు. మళ్లీ అలాంటి మ్యాజిక్ ను సిల్వర్ స్క్రీన్ పై రిపీట్ చేయాలంటే వారి వారసులే చేయాలని అభిమానులు ఆశపడతారు. ఇక.. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రాన్ని రీమేక్ చేయాలని చాన్నాళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా.. ఈ రీమేక్ గురించి మెగాస్టార్ చిరంజీవి తన మనసులోని మాటను బయటపెట్టారు.

రీసెంట్ గా బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ కి ఇచ్చిన ఇంటర్యూలో ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ రీమేక్ లో తన తనయుడు రామ్ చరణ్, శ్రీదేవి తనయ జాన్వీ కలిసి నటిస్తే చూడాలనుందని తెలిపారు. అలాగే.. ఆమధ్య జాన్వీని కలిసినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాయని.. ఆమెను చూస్తే శ్రీదేవి గుర్తుకొచ్చిందని చెప్పారు. మరోవైపు.. తనను ఫ్యాన్స్ కమర్షియల్ సినిమాల్లోనే చూడాలనుకుంటారని.. గతంలో ‘రుద్రవీణ’ వంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసినా ఆడలేదని ఈ సందర్భంగా తెలిపారు మెగాస్టార్. మొత్తంమీద.. బుచ్చిబాబు సినిమాకోసం కలిసి పనిచేస్తున్న చరణ్-జాన్వీ త్వరలోనే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ రీమేక్ లోనూ మురిపిస్తారేమో చూడాలి.

Related Posts