టాలీవుడ్

‘విశ్వంభర’ డ్యాన్సుల్లో మెగా ఛేంజెస్

టాలీవుడ్ లో డ్యాన్సులకు కేరాఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి. అందుకే మెగాస్టార్ తో పనిచేయడానికి కొరియోగ్రాఫర్స్ క్యూ కడతారు. కానీ.. కొన్ని సినిమాలుగా చిరంజీవి తన పాటలకు శేఖర్ మాస్టర్ నే ఎక్కువ తీసుకుంటున్నాడు. ‘వాల్తేరు వీరయ్య‘ వంటి సినిమాలకైతే శేఖర్ సింగిల్ కార్డ్. మొత్తం పాటలన్నీ అతనే కంపోజ్ చేశాడు.

అయితే.. ఇప్పుడు ‘విశ్వంభర’ కోసం డ్యాన్సుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడట చిరంజీవి. పాటలన్నింటికీ ఒకే కొరియోగ్రాఫర్ అయితే మొనాటినీ వస్తుందని భావించిన మెగాస్టార్ ‘విశ్వంభర’లో ఒక్కో పాట కోసం ఒక్కో కొరియోగ్రాఫర్ ను రంగంలోకి దింపుతున్నాడట. ఈకోవలో ఇప్పటికే ఈ చిత్రం కోసం విజయ్ బిన్నీ, శోభి మాస్టర్లు పనిచేశారట. ఇంకా.. మిగతా పాటల కోసం మరికొంతమంది కొరియోగ్రాఫర్స్ పనిచేయనున్నారట.

చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150‘ విషయంలో అదే జరిగింది. ఈ సినిమాలో ఒక్కో పాటను ఒక్కో కొరియోగ్రాఫర్ విభిన్నంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘విశ్వంభర’ సినిమాకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చిరు-కీరవాణి కాంబోలో రూపొందుతోన్న సినిమా ఇది.

TELUGU70MM TEAM

Recent Posts

‘Mr Bachchan’ in romantic mode

Mass Maharaja Ravi Teja is now looking forward to a good win. He is gearing…

1 min ago

దశాబ్దాలుగా చెక్కు చెదరని స్నేహం

దశాబ్దాలుగా చెక్కు చెదరని స్టార్ డమ్ సంపాదించుకున్న కథానాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందన వారే కలెక్షన్ కింగ్…

17 mins ago

‘భగవంత్ కేసరి’ బాలీవుడ్ లోనూ బంపర్ హిట్

మన టాలీవుడ్ హీరోలు చాలామంది బాలీవుడ్ లో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా.. తమ చిత్రాల అనువాద రూపంలో హిందీ…

27 mins ago

హ్యాపీ బర్త్ డే నందమూరి కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్.. వారసత్వ కార్డ్ తో అడుగుపెట్టినా.. హీరోగా తనను తాను మలచుకున్న సెల్ఫ్ మేడ్ స్టార్. కామ్ గోయింగ్…

40 mins ago

రొమాంటిక్ మోడ్ లో ‘మిస్టర్ బచ్చన్’

మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్ కమింగ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'తో బడా హిట్…

1 hour ago

‘Janaka Ayithe Ganaka’ About Children And Fees

Star producer Dil Raju is making full-fledged commercial movies with top heroes on his Sri…

5 hours ago