పంపిణీదారుడిగా కెరీర్ మొదలుపెట్టి.. హాస్య మూవీస్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారాడు రాజేష్ దండా. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నపుడే అల్లరి నరేష్, సందీప్‌కిషన్‌లాంటి వారితో మంచి అనుబంధం ఉందన్నారు. నిర్మాతకు కావాల్సిన కథను ఎన్నుకునే సౌలభ్యం ఉందన్నారు. ప్రస్తుతం ఇదే బ్యానర్‌పై 4 సినిమాలు తీయబోతున్నారు. ఏప్రిల్ 19 న రాజేష్ దండా బర్త్‌డే సందర్భంగా.. మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
స్వామిరారా చిత్రంతో పంపిణీదారునిగా మొదలయి దాదాపు 82 సినిమాలను విడుదల చేశా. ఒక్క క్షణం, నాంది సినిమాలకు సహ నిర్మాతగా పనిచేశా. అనిల్ సుంకరతో ప్రయాణం సాగిస్తూ ఊరి పేరు భైరవ కోన, సామజవర గమన వంటి సినిమాలను నిర్మించా. అవి హిట్ కావడంతో ఈ బర్త్ డే గిఫ్ట్ గా మరో కొన్నిసినిమాలు సిద్ధం చేసుకున్నానన్నారు. నాంది సినిమా నా జోనర్ సినిమా. బచ్చలమల్లి కూడా నా జోనర్ సినిమా. ఇలా నా కిష్టమైన కథలతో మనుషులతో చేయడం చాలా ఆనందంగా వుంటుందన్నారు.
బచ్చలమల్లి సినిమా 90 దశకంలోని కథ. చాలా ఆసక్తికరంగా వుంటుంది. కథ ప్రకారం సహజమైన లొకేషన్లలో తీయాలని అన్నవరం, తుని చుట్టు పక్కల విలేజ్ లలో షూటింగ్ చేస్తున్నాం. మే 10 నుంచి సాగే సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తామన్నారు. కొత్తగా వుండే పాయింట్ తో వెళ్ళాలన్నదే నా పాలసీ. అలాంటి కథలతోనే భైరవ కోన, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, సామజవరగమన వంటి సినిమాలు తీయగలిగానన్నారు. తనకు కమర్షియల్ , యాక్షన్ సినిమాలంటే ఇష్టమన్నారు. బైరవ కోనలో ఓ సాంగ్ వుంది. అది థియేటర్ వరకు తీసుకువస్తుందని భావించాం. అలాగే జరిగింది. నేడు రెగ్యులర్ సినిమాలకు పెద్దగా ఆడియన్ రావడంలేదు. కానీ భిన్నంగా వుంటే తప్పకుండా వస్తారన్నారు. మారేడుమల్లి. షూట్ లో వుండగానే బచ్చల మల్లి కథ విన్నాను. అదేవిధంగా సామజవరగమన షూట్ లో వుండగానే కిరణ్ అబ్బవరం సినిమా అనుకున్నాం. షడెన్ గా వచ్చింది త్రినాథ్ సినిమా.. అన్నారు రాజేష్ దండా