మెగా వినోదం పంచనున్న మెగా 156

‘బింబిసార‘ సినిమాతో మళ్లీ తెలుగులో సోషియో ఫాంటసీ చిత్రాలకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అదే సినిమా డైరెక్టర్ వశిష్ట.. మెగాస్టార్ తో అదే తరహా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మెగా 156 వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమాకి ‘విశ్వంభర‘ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా ఆద్యంతం ముల్లోకాల చుట్టూ సాగుతోందని.. ఈ మూవీలో చిరంజీవి జగదేకవీరుడుగా కనిపించబోతున్నాడనే టాక్ వినిపించింది. అయితే.. లేటెస్ట్ గా మెగా 156 లో మెగాస్టార్ క్యారెక్టర్ పై ఓ కథనం ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

డ్యాన్సెస్, ఫైట్స్ తో పాటు.. కామెడీని పండించడంలో చిరంజీవిది ప్రత్యేకమైన శైలి. చిరు కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ లో సెపరేట్ క్రేజుంది. ఇక.. మెగా 156 లోనూ మెగాస్టార్ కామెడీ ఓ రేంజులో ఉండబోతుందట. ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబు అనే పాత్రలో కనిపిస్తాడట. ఎంతో వినోదాత్మకంగా ఆ పాత్రను తీర్చిదిద్దాడట డైరెక్టర్ వశిష్ట. ఆ పాత్రలో చిరు మేకోవర్, ఆహార్యం కొత్తగా ఉంటాయట. వినోదాన్ని పంచుతూనే చిరు క్యారెక్టర్ చేసే సాహసాలు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయట. యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి మంచి టెక్నికల్ టీమ్ పనిచేస్తుంది. అయితే.. ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

Related Posts