‘మనమే‘ ఫస్ట్ సింగిల్.. డ్యాన్సులు కుమ్మేసిన శర్వానంద్

శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘మనమే‘. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శర్వానంద్ స్టైలిష్ లుక్ తో అలరించబోతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో ‘మనమే‘పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈరోజు ‘మనమే‘ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యింది.

హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్నందిస్తూ తనే ఈ పాట పాడాడు. ‘ఇక నా మాటే‘ అంటూ కృష్ణచైతన్య రాసిన ఈ గీతం ఆకట్టుకుంటుంది. ఫారెన్ లొకేషన్స్ లోని బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేసిన ఈ పాటలో శర్వానంద్ అల్ట్రా మోడర్న్ లుక్ లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా.. ఈ పాటలో శర్వానంద్ స్టెప్పులు సరికొత్తగా ఉన్నాయి.

Related Posts