‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్.. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్

ఈ వేసవి బరిలో హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించగా.. ఇతర కీలక పాత్రల్లో జగపతిబాబు వంటి వారు కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ తో ‘ఫ్యామిలీ స్టార్’పై అంచనాలు భారీగా పెరిగాయి. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్.

‘స్వామి.. కొత్తగా నాకు లైఫ్ లో బ్రేక్ లేమీ ఇవ్వాల్సిన పనిలేదు..ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టొద్దు..’, ‘లిఫ్ట్ లు ఉన్నాయని ఎక్కేసి.. సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి.. మందు ఉందని తాగేస్తే.. హెల్త్..?’ అంటూ ట్రైలర్ లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. ట్రైలర్ ఆద్యంతం మిడిల్ క్లాస్ హీరో.. అతని కుటుంబం.. వారి మధ్యలోకి ఓ పెద్దింటి అమ్మాయి రావడం నేపథ్యంలో ఉంది. మధ్యలో జగపతిబాబు ఎంట్రీ.. ఆ తర్వాత విలన్స్.. టోటల్ గా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘ఫ్యామిలీ స్టార్’ తయారైనట్టు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.

ఇక.. ‘గీత గోవిందం’ తరహాలోనే ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్ల పాత్రలనే హైలైట్ చేస్తూ డైరెక్టర్ పరశురామ్ ‘ఫ్యామిలీ స్టార్’ని తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తే.. కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ సమకూర్చాడు. మొత్తంగా.. ఈ సమ్మర్ సీజన్ లో వేరే పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో ‘ఫ్యామిలీ స్టార్’కి అది బాగా కలిసొచ్చే అంశం.

Related Posts